Genelia : వ‌రుస ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తున్న జెనీలియా.. ఆ అందాల‌కు ముగ్ధులవ్వాల్సిందే..!

Authored By Sam C | The Telugu News | Published on: June 6, 2022, 10:00 pm

Genelia : సీనియ‌ర్ ముద్దుగుమ్మ‌లు కెరీర్‌లో కాస్త బ్రేక్ ఇచ్చి మ‌ళ్లీ వ‌రుస సినిమాల‌తో అల‌రించేందుకు సిద్ధ‌మయ్యారు. వీరిలో బ‌బ్లీ బ్యూటీ జెనీలియా ఒక‌రు. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా ప్రతి ఒక్కరిని ఎట్రాక్ట్ చేసిన ఈ ఆరెంజ్ పిల్ల అప్పట్లో చాలా అల్లరిగా కనిపించేది. కొన్నేళ్ల వరకు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దాదాపు ఎండ్ కార్డ్ పెట్టేసింది. ఇక 8 ఏళ్ల తరువాత తెలుగు తెరపై కనిపించేందుకు సిద్ద‌మైంది. ప్ర‌స్తుతం తాను ప‌లు సినిమాల‌కు కమిట్ అయిన‌ట్టు తెలుస్తుంది. ఈ క్ర‌మంలో జెనీలియా వ‌రుస ఫొటోషూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది.

తాజాగా ఎల్లో క‌ల‌ర్ డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది. జెనీలియాని ఇలా చూసిన ప్రేక్ష‌కుల‌కి కంటిపై కునుకు ప‌ట్ట‌డం లేదు. యంగ్ బ్యూటీల‌తో స‌మానంగా త‌న గ్లామ‌ర్‌ని మెయింటైన్ చేస్తున్న జెనీలియాకి పిల్ల‌లు ఉన్నారంటే ఎవ‌రు నమ్మేలా లేరు.జెనీలియా సత్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈ బ్యూటీ యాక్టింగ్ కి మంచి క్రేజ్ రావడంతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్, విష్ణు వంటి హీరోలతో యాక్ట్ చేసి కేవలం తనకు నచ్చిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. జెనీలియా ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లోనే నటించింది. మెయిన్ గా బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

genelia crazy looks are stunning

genelia crazy looks are stunning

Genelia : జెనీలియా క్యూట్ లుక్స్..

ఆ సినిమాలో హాసినిగా కనిపించి ప్రతి ఒక్కరిని ఎట్రాక్ట్ చేసింది. రెడీ, డీ వంటి సినిమాలు కూడా జెనీలియాకు ఒక బ్రాండ్ ఇమేజ్ సెట్ చేశాయి. తన సినిమా కెరీక్ పీక్స్ లో వుండగానే ప్రియుడు రితేష్ దేశముఖ్ ను పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది.జెనీలియాతో పోల్చితే రితేష్ సుమారు 9 ఏండ్లు పెద్దవాడు. వీరి ప్రేమ విషయం రితేష్ కుటుంబ సభ్యులకు తెలిసింది.హిందూ సంప్రదాయం అంటే ఎంతో గౌరవం ఉన్న ఆయన కుటుంబ సభ్యులు క్రిస్టియన్ అమ్మాయి జెనీలియాతో పెళ్లికి ఒప్పుకోలేదు. చాలా రోజులుకష్టపడి తన కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పాడు రితేష్.జెనీలియాతో పెళ్లికి ఓకే చెప్పించాడు. ప్రస్తుతం వీరికి ఒక బాబు వున్నాడు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp