Genelia : పెళ్లికి ముందే భర్తతో అలా కలిసిన జెనీలియా.. పరువు పోకూడదని..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Genelia : పెళ్లికి ముందే భర్తతో అలా కలిసిన జెనీలియా.. పరువు పోకూడదని..?

 Authored By mallesh | The Telugu News | Updated on :8 October 2022,12:30 pm

Genelia : ఇండస్ట్రీలో చాలా మంది ప్రేమవివాహం చేసుకున్నవారు ఉన్నారు. అందులో కొందరు ఇంట్లో వారిని ఒప్పించి చేసుకుంటే మరికొందరు నేరుగా చేసుకున్న వారున్నారు. ఇక తమ కోస్టార్ ను పెళ్లి చేసుకున్న వారు అయితే చాలా మందే ఉన్నారు. అందులో క్యూట్ హీరోయిన్ జెనీలియా ఒకరు. ఈ నటి తెలుగులో చాలా మంచి సినిమాలు చేసింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు త్వరగా దగ్గరైంది. అనుకోకుండా బాలీవుడ్ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయింది. జెనీలియా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అందులో కుర్రహీరోలు, సీనియర్ హీరోలు కూడా ఉన్నారు.

లవ్ స్టోరీస్‌కు కేరాఫ్‌గా ఒకప్పుడు జెనీలియా కనిపించేది. తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో ఈ బ్యూటీ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఢీ, రెడీ, ఆరెంజ్ వంటి సినిమాల్లో అల్లరి హీరోయిన్ పాత్రలు పోషించింది. జెనీలియా హీరోయిన్ గా నటించిన పాత్రలు చాలా వరకు హిట్ అయ్యాయి. అందులోనూ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో కలిసి నటించిన ఆరెంజ్ సినిమా మాత్రం జెనీలియాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక‘సై’సినిమాలో నితిన్‌తో నటించిన జెనీలియా అప్పట్లో కుర్రహీరోలకు కేరాఫ్ బ్యూటీగా అందరి మన్ననలను పొందింది.

Genelia met her husband like that before marriage

Genelia met her husband like that before marriage

Genelia : రితేష్‌తో లవ్‌ట్రాక్ ఎలా నడిచిందంటే..

తన కెరీర్ మంచి ఊపు మీదున్న టైంలోనే జెనీలియా బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది. అప్పుడే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ చిన్న తనయుడు, యాక్టర్ రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడింది. కొంతకాలం వరకు వీరిద్దరూ పెళ్లికి ముందే డేటింగ్ లో ఉన్నారు. ఓ రోజు వీరిద్దరూ హోటల్ లో కలుసుకున్నట్టు వార్తలు వచ్చాయి. పెళ్లికి ముందే వీరిద్దరూ ఒక్కటయ్యారని.. ఆ తర్వాత ఇంట్లోవారి సమ్మతితో వివాహం చేసుకున్నారట.. ఎందుకంటే పెళ్లికి ముందే వీరు కలిసారని తెలిస్తే పొలిటికల్ పరంగా ఇబ్బంది వస్తుందని రితేశ్ కుటుంబం భావించిందట..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది