Getup Srinu : అన్నపూర్ణమ్మ అతి.. గెటప్ శ్రీను కౌంటర్.. జబర్దస్త్ షోకు మళ్లీ కళ వచ్చేసిందోచ్

Authored By aruna | The Telugu News | Published on: August 2, 2022, 5:40 pm

Getup Srinu : గెటప్ శ్రీను ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు దూరమై ఎన్నో నెలలు అవుతోంది. తన సినిమా షూటింగ్‌‌లతో బిజీగా ఉండటం మూలానే జబర్దస్త్ షోలు చేయలేకపోతోన్నాడని అందరికీ తెలిసిందే. ఇక శ్రీను ప్రస్తుతం అర డజను సినిమాలకు పైగా చేస్తున్నాడు. అందులో సైడ్ ఆర్టిస్ట్‌గా కొన్ని అయితే.. హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇక మధ్యలో జబర్దస్త్, మల్లెమాల మీద ఆర్పీ కామెంట్లు చేయడం, ప్రతిగా ఏడు కొండలు వచ్చి కౌంటర్లు వేయడం, శ్రీను సుధీర్‌ల గురించి చెప్పడం అందరికీ తెలిసిందే. గెటప్ శ్రీను, సుధీర్‌ల మీద ఏడు కొండలు దారుణమైన కామెంట్లు చేశారు. వారు ఎలా రారో చూస్తాను అంటూ తెగేసి చెప్పాడు.

ఇక గెటప్ శ్రీను రాకతోనే.. ఏడు కొండలు మీద కౌంటర్లు వేశాడు. బిల్డప్ బాబాయ్ ఎవరో కాదు.. ఆయనే అంటూ ఏడు కొండలు గురించి దారుణంగా కామెంట్లు చేశాడు. తాను వచ్చిన మొదటి స్కిట్లోనే ఏడు కొండలు మ్యానరిజాన్ని వాడేశాడు. అలా మొత్తానికి శ్రీను రాకతో.. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు ఊపిరి వచ్చింది. అలా గెటప్ శ్రీను తన గెటప్స్‌తో మళ్లీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో గెటప్ శ్రీను అదరగొట్టేశాడు. రెండు మూడు గెటప్స్ చేశాడు.స్టాలిన్ స్పూప్‌గా స్కిట్ చేస్తే.. అందులో ప్రకాష్ రాజ్‌లా అదరగొట్టేశాడు. ఇంకో స్కిట్‌లో పోలీస్ ఆఫీసర్‌గా కొత్త మ్యానరిజాన్ని ట్రై చేశాడు.

Getup Srinu Punch on Annapoornamma in Extra Jabardasth

Getup Srinu Punch on Annapoornamma in Extra Jabardasth

రాం ప్రసాద్, శ్రీను కలిసి చేసిన ఆస్కిట్‌లో అన్నపూర్ణమ్మ కనిపించింది. ఖైదీలా అన్నపూర్ణమ్మ నటించింది. నా మొహం చూసి మాట్లాడు అని శ్రీను అంటే.. ఆ మొహాన్ని ఎవడు చూస్తాడు అని కౌంటర్లు వేస్తుంది. మరో సందర్భంలో శ్రీనుని మించి పోయేలా నటించింది. లాఠీ ఎత్తి శ్రీను కొట్టబోతాడు. కానీ ఇంతలోనే అన్నపూర్ణమ్మ తన అతిని ప్రదర్శిస్తుంది. ఏమో అనుకున్నా.. ఇన్నాళ్లు నాదే ఎక్కువ అనుకున్నా కానీ.. ఈమె ఉంది కదా? అని గెటప్ శ్రీను అనేస్తాడు. దీంతో అన్నపూర్ణమ్మ అవాక్కవుతుంది. ఆ మాటతో అందరూ నవ్వేస్తారు.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp