Mahesh Babu : నీ కష్టం పగోడికి కూడా రాకూడదు.. నీకోసం మేమున్నాం మహేష్ బాబు.. ఘట్టమనేని అభిమానులకు హ్యట్సాఫ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : నీ కష్టం పగోడికి కూడా రాకూడదు.. నీకోసం మేమున్నాం మహేష్ బాబు.. ఘట్టమనేని అభిమానులకు హ్యట్సాఫ్..!

 Authored By ramesh | The Telugu News | Updated on :17 November 2022,1:00 pm

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఘట్టమనేని అభిమానులు తీవ్ర దిగ్రాంతికి గురయ్యారు. ఆయన చేసిన సినిమాలు ఒకసారి నెమరేసుకున్నారు. ఎన్.టి.ఆర్, ఏయన్నార్ తర్వాత వాళ్లకి సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న హీరో కృష్ణ ఒక్కరే. కృష్ణ మరణం మహేష్ ని మరింత కష్టాల్లో పడేసింది. ఈ ఇయర్ మొదట్లోనే జనవరి 8న అన్నయ్య రమేష్ బాబుని కోల్పోయాడు మహేష్. ఆ టైం లో తను కొవిడ్ క్వారెంటైన్ లో ఉండటం వల్ల అన్నయ్యని కడసారి చూసేందుకు కూడా నోచుకోలేదు. ఇక ఇదే ఏడాది సెప్టెంబర్ 28న మహేష్ తన తల్లి ఇందిరా దేవిని దూరం చేసుకున్నారు.

సినిమాల టెన్షన్ లో ఉన్న టైం లో అమ్మ చేతి కాఫీ తనని రిలాక్స్ అయ్యేలా చేస్తుందని మహేష్ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఆమె దూరమవడం మహేష్ ని మరింత బాధపడేల చేసింది. ఇక నవంబర్ 15న తన దైవం అనుకున్న తండ్రి కృష్ణని కోల్పోయాడు మహేష్. ఒకే ఏడాదిలో అన్న, అమ్మ, నాన్న ఇలా ముగ్గురు ఫ్యామిలె మెబర్స్ ని కోల్పోయిన మహేష్ కష్టం ఏ పగోడికి రాకూడదని భావిస్తున్నారు. అంతేకాదు నీకు దూరమైన వారిని తిరిగి తెచ్చివ్వలేం కానీ నీ వెంట మేము ఎప్పటికీ ఉంటాం అని సోషల్ మీడియాలో వారి సపోర్ట్ అందిస్తున్నారు ఘట్టమనేని అభిమానులు.

ghattamaneni fans super support to Mahesh Babu this time

ghattamaneni fans super support to Mahesh Babu this time

కృష్ణ గారిని చివరి చూపు చూసుకునేందుకు తెలుగు రెండు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు. మహేష్ బాబు బాధని ఎవరు తీర్చలేరు కానీ అభిమానులు మాత్రం ఆయనకు మోరల్ స్ట్రెంత్ ఇచ్చేలా సపోర్ట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా తండ్రి నట వారసత్వాన్నే కాదు మంచి తనాన్ని కూడా అందుకున్నారు మహేష్. అందుకే ఆయన చేస్తున్న సినిమాల్లో కూడా ఎంతోకొంత మెసేజ్ ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారు. తప్పకుండా మహేష్ ముందుముందు కృష్ణ గారి సినిమాల స్పూర్తితో మరెన్నో ప్రయోగాలు చేస్తారని చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

 

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది