Chiranjeevi : నిజంగా బుద్ధి ఉంటే చిరంజీవి మళ్ళీ అలాంటి పని చేయొద్దు.. మొత్తుకుంటున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : నిజంగా బుద్ధి ఉంటే చిరంజీవి మళ్ళీ అలాంటి పని చేయొద్దు.. మొత్తుకుంటున్న ఫ్యాన్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :9 October 2022,12:30 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ప్రస్తుత ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే ఆచార్య ప్లాప్ తర్వాత వాళ్ళు బాగా డీలా పడిపోయారు. ఇలాంటి సందర్భంలో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. కలెక్షన్స్ కూడా బాగానే ఉండటంతో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం చిరంజీవిని వాళ్లు తప్పు పడుతున్నారు. బుద్ధుంటే ఇంకోసారి అలాంటి పని చేయొద్దు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు. ఈయన వరుస సినిమాలు చేస్తుంటే చూడడానికి అభిమానులకు చాలా ఆనందంగా ఉంటుంది.. కానీ ఆయన ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు అనే విషయంపై కూడా వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తుంటారు.

ముఖ్యంగా సొంత కథలు చేసినప్పుడు ఉండే ఆనందం.. రీమేక్ స్టోరీస్ చేస్తున్నప్పుడు ఉండదు. ఇప్పటికే వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నాడు అంటూ చిరంజీవిపై చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. 9 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబర్ 150 తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కత్తి సినిమాకు రీమేక్. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమా ఉయ్యాలవాడ జీవిత చరిత్ర. ఆచార్య మాత్రమే సొంత కథ.. ఇది ఫ్లాప్ అయింది. ఇప్పుడు విడుదలైన గాడ్ ఫాదర్ మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్. సెట్స్ పై ఉన్న వాల్తేరు వీరయ్య సొంత కథ.. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న భోళా శంకర్ తమిళంలో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్.

fans requests to Megastar Chiranjeevi

fans requests to Megastar Chiranjeevi

Chiranjeevi : సొంత కథలు లేవా..?

ఇవన్నీ ఇలా ఉండగానే తాజాగా మరో రీమేక్ సినిమా వైపు చిరంజీవి అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. 2022లోనే మలయాళంలో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన మమ్ముట్టి భీష్మ పర్వం సినిమా.. తెలుగులో తాను హీరోగా రీమేక్ చేయాలని భావిస్తున్నాడు చిరంజీవి. ఇప్పటికే ఈ సినిమా తెలుగు హక్కులను రామ్ చరణ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం చిరంజీవి ఇంకా ఇలాగే రీమేక్ సినిమాలు చేస్తూ పోతే.. ఆయనపై విమర్శలు ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు. అందుకే అరువు తెచ్చుకున్న కథలు వద్దు.. సొంత కథలపై ఆధారపడండి అంటూ మొత్తుకుంటున్నారు ఫ్యాన్స్.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది