Ranya Rao : స్మగ్లింగ్ కేసులో హాట్ కన్నడ బ్యూటీ అరెస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ranya Rao : స్మగ్లింగ్ కేసులో హాట్ కన్నడ బ్యూటీ అరెస్ట్

 Authored By ramu | The Telugu News | Updated on :4 March 2025,11:50 pm

ప్రధానాంశాలు:

  •  Ranya Rao : స్మగ్లింగ్ కేసులో హాట్ కన్నడ బ్యూటీ అరెస్ట్

Ranya Rao : బంగారం స్మగ్లింగ్ అనేది ఎప్పటినుంచో నడుస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్నో ఎయిర్‌పోర్టుల్లో అక్రమంగా బంగారం తరలించే వ్యక్తులు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన నటి రమ్య రావు అక్రమంగా బంగారం తీసుకొస్తూ డీఆర్ఐ అడ్డంగా దొరికింది. దుబాయ్ నుంచి తరచుగా భారత్‌కు బంగారం తీసుకువస్తున్న ఆమెపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు నిఘా పెట్టి, బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Ranya Rao స్మగ్లింగ్ కేసులో హాట్ కన్నడ బ్యూటీ అరెస్ట్

Ranya Rao : స్మగ్లింగ్ కేసులో హాట్ కన్నడ బ్యూటీ అరెస్ట్

Ranya Rao  బంగారం స్మగ్లింగ్ డీఆర్ఐ అధికారులకు అడ్డంగా దొరికిన నటి

డీఆర్ఐ అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. రమ్య రావు ఈసారి దుబాయ్ నుంచి 14.8 కిలోల బంగారం అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించింది. ఈ బంగారం విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. గత 15 రోజుల్లోనే నాలుగుసార్లు ఆమె దుబాయ్ వెళ్లి రావడం అనుమానాస్పదంగా మారడంతో అధికారులు ప్రత్యేకంగా ఆమెపై నిఘా ఉంచారు. చివరకు పక్కా సమాచారం మేరకు బంగారం బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకువస్తుండగా పట్టుకున్నారు.

ఆమె గతంలో కూడా ఇలానే స్మగ్లింగ్‌లో పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రమ్యను అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె తాను డీజీపీ కూతురిని అంటూ ప్రచారం చేసుకుంటోందని తెలుస్తోంది. కన్నడ చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్‌తో కలిసి “మాణిక్య” సినిమాలో నటించింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది