Pawan Kalyan OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫ్యూజులు అవుట్ అయ్యే అప్డేట్.. OG అక్కడ పోరాట ఘట్టాలు..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫ్యూజులు అవుట్ అయ్యే అప్డేట్.. OG అక్కడ పోరాట ఘట్టాలు..!
Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సెట్స్ మీద మూడు సినిమాలు ఉంచాడు. ఐతే అందులో హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు ఇప్పుడప్పుడే టైం ఇచ్చేలా లేడు. ప్రస్తుతం హరి హర వీరమల్లుని ముందు పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఓజీ మీద ఫోకస్ చేయనున్నాడు. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా ఫ్యాన్స్ కి క్రేజీ ట్రీట్ ఇవ్వనుంది. సినిమా నుంచి వ్చ్చిన ఫస్ట్ గ్లింప్స్ తోనే రేంజ్ పెంచేశాడు సుజిత్. పవర్ స్టార్ నుంచి రాబోతున్న స్టైలిష్ యాక్షన్ మూవీగా ఓజీ మీద భారీ హైప్ ఏర్పడింది.
ఐతే ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ బ్యాంకాక్ కి షిఫ్ట్ అయ్యింది. ఓజీ మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్కడ సినిమాకు సంబందించిన కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తారని తెలుస్తుంది. సాహో లో యాక్షన్ సీన్స్ లో తన మార్క్ చూపించాడు సుజిత్. మరోసారి ఓజీ సినిమాలో కూడా అలాంటి థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ నే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు బ్యాంకాక్ లోనే సినిమాకు సంబందించిన మెయిన్ సీన్స్ అన్ని చేస్తారని తెలుస్తుంది.
Pawan Kalyan OG పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్..
OG సినిమా లో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పవర్ స్టార్ ఫ్యాన్ అయిన సుజిత్ తన అభిమాన హీరోని ఎలా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారో అదే రేంజ్ లో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. సినిమా కాస్త లేట్ అవుతున్నా కూడా అంతకుమించి డబల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని అంటున్నారు. సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుజిత్ ఓజీతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటుతాడని అంటున్నారు.
ఓజీ సినిమా పవర్ స్టార్ మొదటి పాన్ ఇండియా రిలీజ్ అవ్వాల్సింది. ఐఏ వీరాల్లు సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఓజీ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. Power Star, Pawan Kalyan, Pawan Kalyan OG, OG Makers, Sujith, DVV Entertainments