
Kurrollu Movie : బూతు పాట వదిలిన నిహారిక.. నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారుగా..!
Committee Kurrollu Movie : మెగా బ్రదర్ నాగబాబు Nagababu ముద్దులు కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. విడాకుల విషయంతో నిహారిక బాగా ట్రోలింగ్ ఎదుర్కొంది. ఎంతో అట్టహాసంగా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకొని కనీసం పట్టుమని ఐదు సంవత్సరాలు కూడా సంసార జీవితం గడపలేదంటూ నిహారికని ఓ రేంజ్‌లో విమర్శించారు. అయితే అవన్నీ పట్టించుకోని నిహారిక తన పని తాను చేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం నూతన రచయితలు, దర్శకులతో మంతనాలు జరుపుతుంది. ఈ క్రమంలోనే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై కమిటీ కుర్రోళ్ళు టైటిల్ తో ఒక చిత్రం ప్రకటించింది. మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసింది. కమిటీ కుర్రోళ్ళు మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది.
ఇక తాజాగా కమిటీ కుర్రోళ్ళు చిత్రం నుండి ఓ సాంగ్ విడుదల చేసింది. ఈ సాంగ్ ఎన్నికలను ఉద్దేశించి రూపొందించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రలోభాలకు పాల్పడేవారిని, డబ్బులకు అమ్ముడుపోయే వాళ్ళను విమర్శిస్తూ చిత్రీకరించారు. ఈ సాంగ్ లిరిక్స్ లో బూతులు వాడేశారు. ‘గుర్రెల’ అంటూ సాగే ఈ పాటకి అనుదీప్ దేవ్ స్వరాలను సమకూర్చగా.. నాగ్ అర్జున్ రెడ్డి లిరిక్స్ అందించారు. నిహారిక, అనుదీప్ దేవ్, వినాయక్, అఖిల్ చంద్ర, అర్జున్ విజయ్ ఇలా చాలామంది కలిసి పాడారు లిరిక్స్ కానీ.. పిక్చరైజేషన్ కానీ.. పొలిటికల్ అజెండాతోనే రూపొందించినట్టు కనిపిస్తోంది. ‘మనిషివా గొర్రెవా’ అంటూ మొదలైన ఈ పాట ఓటర్లను ఆలోచింపచేసే విధంగా ఉంది. ‘తాగి ఉన్నప్పుడు బండే తీయరు అలాంటిది ఓటు ఎలా వేస్తారంటూ’ గట్టిగానే ప్రశ్నించారు.
Kurrollu Movie : బూతు పాట వదిలిన నిహారిక.. నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారుగా..!
ఇక సీఎం జగన్ టార్గెట్‌గా.. ‘ఎలక్షన్స్‌లో ఎవడ్రా నీకు మందు పంచిపెట్టేది అంటే.. అక్కడ A1 గాడు పంచుతున్నాడు కదా’ అని కూడా లిరిక్స్ రాసి.. అధికారి పార్టీని గిచ్చేట్టుగానే రాశారు. సీఎం జగన్.. ఎన్నికలకు ముందు.. అవినీతి ఆరోపణల్లో భాగంగా A1గా జైలుకి వెళ్లి బెయిల్‌పై వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా ప్రస్తావిస్తూ.. A1 గాడు అంటూ సెటైర్లు వేశారు.తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌ని ఇన్‌డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ నిహారిక ఇలా ప్రచారం చేస్తుందా అని పలువురు ముచ్చటించుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు నిహారికని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.