Revanth Reddy : మే 13న ఎన్నికలు జరగనుండగా, మరి కొద్ది రోజులలో ప్రచారానికి పులిస్టాప్ పడనుంది. మరో నాలుగు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండగా వీటిపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ఇక ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుపై సంచలనవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో శిష్యుడు కోసం గురువు టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికలలో పోటీచేయకుండా నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు శిష్యుడు గురువు కోసం ఏమైనా సహాయం చేసే అవకాశం ఉందా అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురు కాగా, దానికి రేవంత్ రెడ్డి షాకింగ్ సమాధానం చెప్పాడు.
రేవంత్ రెడ్డి స్పందిస్తూ… ‘ఎవడయ్యా బుర్రలేనోడు మాట్లాడేది. శిష్యుడు ఎవరు..? గురువు ఎవరు..? నేను సహచరుడిని అని చెప్పిన. ఎవడన్న బుద్దిలేని గాడిద కొడుకు గురువు, శిష్యుడు అని మాట్లాడితే.. ముడ్డి మీద పెట్టి తంతా.. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. నేను ఎఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ పార్టీలోకి పోయాను. నేను సహచరుడిని’ అని సమాధానం చెప్పారు. తాను ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్లానని, తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు కాబట్టి పార్టీ అధినేతగా ఆయనకు నేను అపారమైన గౌరవాన్ని ఇస్తానని పేర్కొన్నారు. ఏపీలో చంద్రబాబుకి మీరు సహకారం అందిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీలో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఉన్నారని, ఆమెను ముఖ్యమంత్రిని చేయాలని వైజాగ్ వెళ్లి ప్రచారం చేసి వచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షర్మిల ను కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ నిర్ణయిస్తే ముఖ్యమంత్రి చేయడానికి నేను పనిచేస్తానన్నారు. వేరే పార్టీల కోసం పని చేయాల్సిన అవసరం తనకు లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పదేపదే రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకటేనని, రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు, చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసిపి నేతలు. దీనికి రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం అందరికి ఓ క్లారిటీ వచ్చేలా చేసింది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.