Guppedantha Manasu 12 Sep Today Episode : రిషి, వసు ప్రేమించుకుంటున్నారని దేవయానికి తెలుస్తుందా? మహీంద్రా, జగతి పెళ్లి రోజు ప్రశాంతంగా జరుగుతుందా?
Guppedantha Manasu 12 Sep Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 సెప్టెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 553 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవయాని విషయంలోనే జగతి, మహీంద్రాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే రిషిని ఒప్పించి మరీ తమ పెళ్లి రోజును ఇంట్లోనే చేయించాలని దేవయాని ఎందుకు అనుకుంది అనే దానిపై మహీంద్రా, జగతిలకు అర్థం కాదు. మరోవైపు ఈ రిషి.. దేవయానిని గుడ్డిగా నమ్మడం చూసి వాళ్లకు ఏం అర్థం కాదు. దేవయాని నిజస్వరూపం రిషి ఎప్పుడు తెలుసుకుంటాడో అని మహీంద్రా అనుకుంటాడు. రెస్టారెంట్ లో వసును కలిసి ఆ నిజం తెలుసుకొని షాక్ అవుతారు మహీంద్రా, జగతి. అసలు దేవయాని.. వసుతో రిషిని ఒప్పించమని ఎందుకు అన్నదో వాళ్లకు అర్థం కాదు.
ఇంతలో రిషి వస్తాడు. వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందని వాళ్లకు క్లారిటీ వస్తుంది. ఎలాగైనా ఇద్దరి పెళ్లి త్వరగా చేయాలని, లేకపోతే ఆ దేవయాని మళ్లీ ఏదైనా అడ్డంకులు సృష్టిస్తుందని అనుకుంటారు మహీంద్రా, జగతి. ఇంటికి రా అని అడిగితే నాకు డ్యూటీ ఉంది రాను అంటుంది వసు. కానీ.. రిషి వచ్చి పదా వెళ్దాం అనగానే తనతో పాటు బయలుదేరుతుంది. వసుధారను డైరెక్ట్ గా తన ఇంటికి తీసుకెళ్తాడు రిషి. మరోవైపు మహీంద్రా, జగతి పెళ్లి రోజు వేడుకల కోసం కేక్ తెప్పించాలని దేవయాని.. గౌతమ్ కు చెబుతుంది. కేక్ సెలక్షన్ లో రిషి కింగ్. కేక్ సంగతి వాడు చూసుకుంటాడు. చిన్న చిన్న డెకరేషన్స్ అవి నేను, ధరణి వదిన చూసుకుంటాం అని చెప్పి వెళ్తాడు గౌతమ్.
అయితే.. వసుధర రావడం చూస్తుంది దేవయాని. అక్కడే ఆగిపోయావేం. లోపలికి రా అని ప్రేమగా మాట్లాడినట్టు నటిస్తుంది. అంతా కులాషాయేగా. పరీక్షలు బాగా రాశావట కదా. నీకేంటి అమ్మా.. ర్యాంక్ స్టూడెంట్ వి. ఇప్పటికే జీవితంలో చాలా సాధించావు కదా.
ఇప్పటికే నువ్వు చాలా విజయాలు సాధించావు కదా అంటుంది. ఇంతలో రిషి లోపలికి వస్తాడు. పెద్దమ్మ.. వసుధారను నేనే తీసుకొచ్చాను అంటాడు రిషి. ఫంక్షన్ పనుల్లో వదిన ఒక్కరే ఇబ్బంది పడుతున్నారు కదా. వదినకు తోడుగా ఉంటుందని తీసుకొచ్చా అంటాడు రిషి. దీంతో సరే రిషి అంటుంది దేవయాని.
Guppedantha Manasu 12 Sep Today Episode : అందరితో కలిసి భోజనం చేసిన తర్వాత పూలు అల్లిన వసుధార
దేవయాని వసుధారపై ప్రేమ చూపిస్తున్నట్టు నటిస్తుండటంతో అర్థం చేసుకోవాలి కానీ.. పెద్దమ్మది చాలా మంచి మనసు వసుధార అని అంటాడు రిషి. దీంతో మొదట జగతి ఈ ఇంట్లో అడుగుపెట్టింది. ఇప్పుడు వసుధార వచ్చింది. తెలివి తక్కువ సాక్షి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంది అని అనుకుంటుంది దేవయాని.
తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. ఎగ్జామ్స్ కోసం చాలా కష్టపడ్డావు. ఏం తిన్నావో ఏమో తిను అని తన పక్కనే కూర్చోబెట్టుకొని భోజనం తిను అని వసుధారతో అంటాడు రిషి. అందరూ భోజనాలు చేశాక.. గౌతమ్, జగతి, వసుధార, ధరణి అందరూ కలిసి పూలు అల్లుతూ ఉంటారు.
వసుధార నీకు అన్ని పనులు వస్తాయా అని అడుగుతుంది. దీంతో పల్లెటూరులో అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. చిన్నప్పుడే అన్ని పనులు నేర్చుకుంటాం అంటుంది వసుధార. నువ్వు పూలు భలే అల్లుతున్నావు అని ధరణి వసుధారతో అంటుంది.
ఇంతలో మహీంద్రా, రిషి ఇద్దరూ కిందికి దిగుతూ ఉంటారు. రిషి వసును.. వసు రిషిని చూస్తుంది. జగతి మేడమ్ నేను మీకు ఏ విధంగా సాయ పడగలను అంటాడు మహీంద్రా. దీంతో మేము చేసుకుంటాం అంటుంది జగతి. దీంతో అంటే.. మేము ఈ పనికి పనికిరామనా. మేము అన్ని రంగాల్లో ముందుంటాం అని చెప్పి రిషితో పూలు అల్లిస్తాడు మహీంద్రా. వసును చూసుకుంటూ రిషి పూలు అల్లుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.