Guppedantha Manasu 13 Aug Today Episode : రిషి పెళ్లిని ఆపడానికి మహీంద్రా, జగతి ప్లాన్.. అది వర్కవుట్ అవుతుందా? సాక్షితో రిషి పెళ్లి ఆగుతుందా?

Authored By Varun G | The Telugu News | Updated on : 13 August 2022, 10:00 am

Guppedantha Manasu 13 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 ఆగస్టు 2022, శనివారం ఎపిసోడ్ 528 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాలేజీ ఎండీ సీటులో మీరు తప్పితే ఇంకెవరూ కూర్చోకూడదు అని రిషితో అంటుంది జగతి. ఇంతలో అక్కడికి సాక్షి వస్తుంది. సాక్షి వచ్చి ఈ రెండు డ్రెస్సుల్లో ఏది బాగుందో చెప్పు రిషి అంటుంది సాక్షి. దీంతో నీకు ఈ డ్రెస్సులు అంతగా బాగుండవు వసుధర అంటాడు రిషి. దీంతో సాక్షితో పాటు అక్కడే ఉన్న జగతి, మహీంద్రా ఇద్దరూ షాక్ అవుతారు. కోపంతో నేను వసుధరను కాదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది సాక్షి. మరోవైపు ఫోన్ లో రిషి ఫోటోను చూస్తూ తన పాత మెమోరీస్ ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. ఎందుకు వచ్చావు అని అడుగుతుంది జగతి. ఏం చూద్దామని వచ్చావు. ఓడిపోయావని మాకు గుర్తు చేద్దామనా అంటుంది జగతి. దీంతో ఏంటి మేడమ్ మీరు. ఇప్పుడు ఏమైందని అంటుంది వసుధర. దీంతో చిరునవ్వు నవ్వుతున్నావా? నువ్వు బాధపడ్డా.. నేను బాధపడకపోయేదాన్నేమో. కానీ.. నువ్వు ఇలా ఏం జరగనట్టు ఉన్నావు చూడు.. అంటుంది జగతి.

guppedantha manasu 13 august 2022 full episode

guppedantha manasu 13 august 2022 full episode

నేనేంటో పిచ్చిదాన్ని. ఇవన్నీ మీకు తెలియదా. పెద్ద గొప్పగా మీకు చెబుతున్నాను. సారీ మేడమ్ ఎక్కువగా మాట్లడానేమో. వసు.. నిన్ను ఏమనాలో.. తిట్టాలో.. గర్వపడాలో తెలియని స్థితిలో ఉన్నాను అంటుంది జగతి. వసు.. కొన్నిసార్లు ఏటికి ఎదురు ఈదడమే కరెక్ట్. ప్రవాహానికి ఎదురు వెళ్తూ మొండిగా వెళ్తేనే విజయం సాధిస్తాం అంటుంది జగతి. మేడమ్ దయచేసి నన్ను ఇంకా బాధించకండి అంటుంది వసుధర. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా మనసు చెబుతోంది…ఏదో ఒకటి జరిగి ఈ పెళ్లి ఆగి.. అనబోతుండగా అక్కడికి దేవయాని వస్తుంది. జగతి అని పిలుస్తుంది. ఏంటి జగతి ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు. ఎంత కాదన్నా.. కన్నతల్లివి కదా.. ప్రపంచానికి. పనులన్నీ అలాగే ఉన్నాయిరా.. వసుధర రా అంటుంది దేవయాని.

మీకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి అంటుంది దేవయాని. మరోవైపు రిషి లగ్నపత్రిక కోసం రెడీ అవుతాడు. నేనేం చేస్తున్నానో నాకు అర్థం అవుతోందా? నాకు క్లారిటీ ఉంది. నేను నమ్మిందే చేస్తున్నాను.. అని అనుకుంటూ అద్దం వైపు చూస్తుంటాడు రిషి. ఇంతలో అద్దంలో తనకు వసుధర కనిపిస్తుంది.

Guppedantha Manasu 13 Aug Today Episode : లగ్నపత్రిక రాసుకోవడానికి వచ్చిన సాక్షి పేరెంట్స్

ఏంటి వసుధర.. రిషి సార్ అర్థం కారు అనుకుంటున్నావా? లైఫ్ అంటేనే అర్థం కాని ఒక చిక్కుల లెక్క కదా. వసుధర నేను ఏం చేస్తున్నానని ఫీల్ అవుతున్నావా? పరీక్ష పెట్టుకుంటున్నాను వసుధర. నాకు నేనే పరీక్ష పెట్టుకుంటున్నాను. ప్రేమకు పరీక్ష పెట్టుకుంటున్నాను.

ఇందులో ప్రేమ అయినా ఓటమి అయినా అన్నింటికీ నాదే బాధ్యత అంటాడు రిషి. ఏంటి వసుధర మాట్లాడవు. అయినా నీకు మాట్లాడే అవకాశం ఏముంది అని అనుకుంటున్నావా? నువ్వు ఏం చెప్పినా.. ఏం చెప్పకపోయినా నా మనసు చెప్పేదే నేను వింటున్నాను.

రిషీంద్ర భూషణ్.. ఒకే మాట మీద ఉంటాడు. ఒకే ప్రేమను నమ్ముతాడు. నమ్మినదాని కోసం ప్రాణం ఇస్తాడు. ప్రాణం ఇచ్చేదాన్నే నమ్ముతాడు అంటాడు రిషి. నేను ఎక్కడికి వెళ్తున్నానో గమ్యం తెలుసు కానీ.. ఈ ప్రయాణం ఎలా కొనసాగుతుందో నీకు తెలియదు. నాకు తెలియదు అంటాడు రిషి.

కాలాలు మారినా క్యాలెండర్ మారినా ఈ రిషీంద్ర భూషణ్ మనసు మారదు.. అని తనను అద్ధంలో టచ్ చేయబోతాడు. ఇంతలో తను అదృశ్యం అవుతుంది. ఇంతలో ధరణి అక్కడికి వస్తుంది. దీంతో జరగాల్సింది జరుగుతుంది మీరు వెళ్లండి నేను వస్తాను అని అంటాడు రిషి.

రిషి చేసే ప్రతి పనిని ఎందుకు మౌనంగా అంగీకరిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు జగతి అంటాడు మహీంద్రా. వాడు చేసే పనిని చూస్తూ ఏం మాట్లాడకుండా ఉండాలా? ఈ ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండాలా? మాట్లాడవేంటి జగతి. వాడు నాకు నచ్చని పని చేస్తున్నాడు.

వసుధర మీద ఇలా పగ తీర్చుకుంటున్నాడా? వాడు చేసేది తప్పు అని నీకు తెలుసు, నాకు తెలుసు కదా. ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఒక తప్పు జరుగుతుంటే దాన్ని అడ్డుకోకపోతే ఆ తప్పును సమర్థించిన వాళ్లం అవుతాం కదా. ఏదో ఒకటి చేయాలి జగతి అంటాడు.

దీనికి మనం ఇద్దరం ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అంటాడు మహీంద్రా. దీంతో జగతి షాక్ అవుతుంది. మనం వెళ్లిపోతేనే ఇది ఆగుతుంది అంటాడు. దీంతో తర్వాత అంటుంది జగతి. దీంతో తర్వాతి లెక్కలు తర్వాత చూసుకుందాం అంటాడు. దీంతో నేను రాను మహీంద్రా అంటుంది.

మనం వెళ్లిపోతే జరిగేది ఆగుతుంది అనుకుంటున్నావా? ఇంకా తొందరగా ఈ తంతు జరుగుతుంది. మనం లేమని తెలిస్తే ఏకంగా రిషి సాక్షి మెడలో తాళి కట్టే పరిస్థితులు వచ్చినా వస్తాడు అంటుంది జగతి. దీంతో మహీంద్రాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు.

అసలు వసు మనసులో ఏముంది అత్తయ్య అని ధరణి.. జగతితో అంటుంది. దీంతో జరిగే వాటిని మనం ఆపలేము అంటుంది జగతి. మరోవైపు సాక్షి పేరెంట్స్ ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

  1. "Priyanka Jain Shiva Kumar : చి ఛీ ప్రియాంక ఇలా చేశావ్ ఏంటి.. ‘టాక్సిక్’ తబాహీ సాంగ్‌కు బోల్డ్ వీడియోతో ర‌చ్చ ర‌చ్చ‌..!"

  2. "Tejaswini : నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. తేజస్విని టాలీవుడ్ ఎంట్రీ.. స్క్రిప్ట్ అదిరిపోయింది !!"

  3. "Karmakhya Movie Review : కర్మాఖ్య మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  4. "Bhogapuram Airport Modi : భోగాపురం వేదికగా మోడీ బిగ్ సర్‌ప్రైజ్.. అందరి దృష్టి ఏపీపై..!"

  5. "Telangana New Pension : బ్రేకింగ్‌.. తెలంగాణలో భారీ శుభవార్త.. ఆగస్టు 15 నుంచే కొత్త పింఛన్లు..!"

  6. "Karthika Deepam 2 Today Episode 2026 July 31 : కార్తీక దీపం 2 జ్యోత్స్న ప్లాన్‌కు సూరజ్ మాస్టర్ ట్విస్ట్.. చివరికి షాక్ ఆమెకే!"

  7. "Gold Rate Today : ప‌సిడి కొనేవారికి గుడ్ న్యూస్… తులం బంగారం ఇంకా రూ.40 వేల తక్కువే.. జూలై 31 తాజా ధరలు ఇవే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp