Guppedantha Manasu 15 Dec Today Episode : రిషిని పెళ్లి చేసుకొని నీ బండారం మొత్తం బయటపెడతా అని దేవయానికి వసుదార చాలెంజ్.. రిషి ఒప్పుకుంటాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 15 Dec Today Episode : రిషిని పెళ్లి చేసుకొని నీ బండారం మొత్తం బయటపెడతా అని దేవయానికి వసుదార చాలెంజ్.. రిషి ఒప్పుకుంటాడా?

Guppedantha Manasu 15 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 డిసెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 634 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కోసారి మనం ఓడిపోయి ఎదుటివాళ్లను గెలిపించాలి. ఇక్కడ గెలిచింది వసుధార కాదు.. నేను. నేను గెలిచాను. రిషికి నేను పెద్దమ్మను. రిషికి అన్నీ నేనే. రిషి వసుధారకు, ఆ పొజిషన్ ఇవ్వాలనుకున్నాడు. రిషి కోసం నేను ఏదైనా చేస్తానని నమ్మిస్తాను. కానీ.. […]

 Authored By gatla | The Telugu News | Updated on :15 December 2022,9:00 am

Guppedantha Manasu 15 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 డిసెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 634 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కోసారి మనం ఓడిపోయి ఎదుటివాళ్లను గెలిపించాలి. ఇక్కడ గెలిచింది వసుధార కాదు.. నేను. నేను గెలిచాను. రిషికి నేను పెద్దమ్మను. రిషికి అన్నీ నేనే. రిషి వసుధారకు, ఆ పొజిషన్ ఇవ్వాలనుకున్నాడు. రిషి కోసం నేను ఏదైనా చేస్తానని నమ్మిస్తాను. కానీ.. నేను చేసేది చేస్తాను. అందులో ఇదొకటి. వసుధారను ఓడించడం పెద్ద పని కాదు. కానీ.. వసుధార ఓడిపోతే రిషి దృష్టిలో నేను ఓడిపోతాను. వసుధారను గెలిపిస్తే ఆ గెలుపు నాది అవుతుంది అని లెక్చరర్లతో చెబుతుంది దేవయాని. దీంతో మేడమ్ ఇవన్నీ బాగానే చెబుతున్నారు కానీ.. జగతి ప్లేస్ లో వసుధార కూర్చొంటే మనం చప్పట్లు కొడదామా అంటారు. దీంతో ఈ విజయంతో వాళ్లు ఏమరపాటుతో ఉంటారు. అప్పుడే మనం దెబ్బ కొట్టాలి అంటుంది దేవయాని. వసుధార ఏదో తప్పు చేయకుండా దొరకదా. అది నాకు కనిపెట్టి చెబితే అప్పుడు నేను వాళ్ల సంగతి చూస్తాను అంటుంది దేవయాని.

guppedantha manasu 15 december 2022 full episode

guppedantha manasu 15 december 2022 full episode

మరోవైపు జగతి.. వసుధారకు ఫోన్ చేసి ఇది గొప్ప విజయం. కంగ్రాట్స్ అంటుంది జగతి. దీంతో మేడమ్ ఇది నా విజయం కాదు. ఇది మీది, రిషి సార్ విజయం అంటుంది వసుధార. దీంతో అదేం కాదు. నీలో ప్రతిభ ఉంది. నీ తెలివితేటలే నిన్ను గెలిపిస్తున్నాయి అని అంటుంది జగతి. దీంతో మేడమ్ నన్ను ఓడించాలని కొన్ని ప్రయత్నాలు జరిగాయి అంటుంది. దేవయాని గారు అంటూ ఏదో చెప్పబోతుండగా దేవయాని అక్క తెలివితేటలు అలాగే ఉంటాయి కానీ.. రిషి ముందు నిన్ను గెలిపించాలని గెలిపించింది. వీళ్లందరి గురించి పెద్దగా ఆలోచించకు. నీకు ఇచ్చిన పనిని సమర్థంగా పూర్తి చేయి అంతే అని చెబుతుంది జగతి. దీంతో ప్రయత్నిస్తాను మేడమ్ అంటుంది వసుధార.

ఇంతలో వసుధార దగ్గరికి ఆ ఇద్దరు లెక్చరర్లు వస్తారు. కంగ్రాట్స్ వసుధార అంటారు. అభినందనలు వసుధార అంటారు. దీంతో గెలుపు ఆపాలని చాలామంది ప్రయత్నించారు లేండి అంటుంది. దీంతో మా అభిప్రాయాలు మేము చెప్పాం. అసలు రిషి సార్ ను బుట్టలో వేసుకోకపోతే నీ ఆటలు ఇలా సాగుతాయా.. అంటారు డైరెక్ట్ గా.

ఈ కాలేజీలో నువ్వు పేరుకే స్టూడెంట్ వి. కానీ.. నువ్వు ఎండీ తర్వాత ఎండీ లాంటి దానివి కదా అంటారు. దీంతో మర్యాదగా మాట్లాడండి అంటుంది. దీంతో నీతో మాకు వైరం ఏంటి వసుధార. అసలు నీ ఏజ్ ఎంత. ఇంత చిన్న వయసులో ఎంత ఎదిగిపోయావు. ఇదంతా ఎలా సాధ్యమయింది అని అడుగుతారు.

దీంతో అన్నీ కళ్ల ముందు కనబడుతుంటే ఇవన్నీ అడుగుతారేంటి అని అంటుంది మరో లెక్చరర్. రిషి సార్ బలహీనతలు ఏంటో వసుధార కనిపెట్టేసింది. అందుకే ఇలా ఎదిగింది అని అంటారు. ఇప్పుడు నీకు రిషి సార్ సపోర్ట్ గా ఉంటారు అంటారు. దానికే లివింగ్ టుగెదర్ అనే మాటలు వినడమే కానీ.. ఇదిగో ప్రత్యక్షంగా ఇప్పుడే చూస్తున్నాను అంటారు.

Guppedantha Manasu 15 Dec Today Episode : జగతితో బాధపడుతూ లెక్చరర్స్ అన్న మాటలు చెప్పిన వసుధార

ఒక మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని చూశాం కానీ.. ఇప్పుడు ఒక స్త్రీ విజయం వెనుక మగాడు ఉన్నాడు అని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో ఏం చేయాలో వసుధారకు అర్థం కాదు. ఆటోలో వెళ్తూ ఉంటుంది. దీంతో వసుధార ఎక్కడికి వెళ్లింది అని అనుకుంటాడు రిషి.

జగతి దగ్గరికి వెళ్లిన వసుధార.. మేడమ్ నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అని అంటుంది. ఏడుస్తుంది. దీంతో జగతికి ఏం చేయాలో అర్థం కాదు. స్టాఫ్ అందరూ ఎందుకు అలా మాట్లాడారు. వాళ్లకు అంత ధైర్యం ఎందుకు వచ్చిందో.. ఎవరు వాళ్లతో మాట్లాడిస్తున్నారో తెలుసుకోవాలి అని అంటుంది జగతి.

ఇంతలో అక్కడికి వస్తుంది దేవయాని. మీ గురు శిష్యులను అలా చూసి నా మనసు పొంగిపోయింది అంటుంది దేవయాని. ఏంటి వసుధార. నువ్వు ఇక్కడ ఉంటావని అస్సలు ఊహించలేదు. నువ్వు మళ్లీ సిగ్గు లేకుండా ఇక్కడికి వస్తావని అస్సలు అనుకోలేదు అంటుంది దేవయాని.

దీంతో మీరు కొంచెం మర్యాదగా మాట్లాడండి అంటుంది జగతి. దీంతో నాకు మర్యాదలు నేర్పుతున్నారా అంటుంది దేవయాని. సరే.. మర్యాద అంటే నీకు తెలిసిన అర్థం ఏంటో నాకు తెలియదు కానీ.. మధ్యరాత్రులు కలిసి తిరగడాలా.. కారులో షికారు చేయడాలా.. చెప్పాపెట్టకుండా ఇంటికి వచ్చేయడాలా.. ఇవేనా మర్యాద అంటే అంటుంది దేవయాని.

వీటి గురించేనా నువ్వు మాట్లాడేది. కాదు కదా అంటుంది దేవయాని. నేను ఎక్కడికి వెళ్లినా.. ఎవరితో కలిసి తిరిగినా నా హద్దుల్లో నేను ఉంటాను అంటుంది వసుధార. దీంతో హద్దుల గురించి నువ్వు మాట్లాడకు వసుధార. ఏదైనా అంటే రిషి సార్ నావాడు అంటావు. అంత ధైర్యమా నీకు.

ఇది ఒక ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణం అని నేను అయితే అనుకోవడం లేదు. మీ గురువు గారు ఏం అనుకుంటున్నారో నీకే తెలియాలి వసుధార అంటుంది దేవయాని. చూడు జగతి. ప్రతి దానికి ఒక హద్దు అంటూ ఉంటుంది. ఆ హద్దులు దాటేదాకా తెచ్చుకోవద్దు. అక్కడి దాకా వచ్చిందనుకో. ఇదిగో పరిస్థితులు ఇలాగే ఉంటాయి అంటుంది.

వసుధార నీకంటే తెలివైంది. రిషి మనసు తెలుసుకొని.. రిషికి తెలియకుండా రిషినే ఆడిస్తోంది అంటుంది దేవయాని. దీంతో మేడమ్ ఎవరు ఎవరిని ఆడించడం లేదు. మీ నోటికొచ్చినట్టు మాట్లాడితే వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు అంటుంది వసుధార.

ఈ ఇంట్లోకి మీరు అడిగిన దానికి వంద రెట్లు దీటుగా సమాధానం ఇస్తా అని దేవయానితో చాలెంజ్ చేస్తుంది వసుధార. అంతే కాదు. మీరేంటో.. మీ ఆలోచనలు ఏంటో రిషి సార్ కు తెలిసేలా చేస్తా అని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటుంది. ఎవ్వరు ఆగమన్నా వసుధార ఆగదు.

మరోవైపు వసుధారకు గిఫ్ట్ ఇవ్వడానికి బొకే తీసుకొస్తాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది