Guppedantha Manasu 18 Nov Today Episode : వసుధార ఇంటర్వ్యూకు జగతి వస్తుందా? మహీంద్రా మాట కాదని జగతి ఇంటర్వ్యూకు వెళ్తుందా? ఇంతలో వసుధారకు షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guppedantha Manasu 18 Nov Today Episode : వసుధార ఇంటర్వ్యూకు జగతి వస్తుందా? మహీంద్రా మాట కాదని జగతి ఇంటర్వ్యూకు వెళ్తుందా? ఇంతలో వసుధారకు షాక్  

 Authored By gatla | The Telugu News | Updated on :18 November 2022,9:00 am

Guppedantha Manasu 18 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 నవంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 611 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం అనుకున్న దానికి ఇంకా రెండు మూడు అడుగుల దూరంలోనే ఉన్నాం. ఇప్పుడు వెళ్లడం కరెక్ట్ కాదు అంటాడు మహీంద్రా. దీంతో ఇప్పుడు నేను వెళ్లకపోతే రిషి నన్ను క్షమించడు అంటుంది జగతి. దీంతో నేను చెప్పేది చెప్పాను. వింటావనే అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మహీంద్రా. దీంతో జగతికి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు వసుధర ఇంటర్వ్యూకు రెడీ అవుతూ ఉంటుంది. వసుధర.. నువ్వు మంచి అమ్మాయివి. ఏ విషయంలోనూ ఎలాంటి పంతాలకు వెళ్లకుండా రిషి సార్ చెప్పినట్టే వినాలి అంటూ తనలో తాను అనుకుంటుంది. ఇంతలో రిషి వస్తాడు. సార్ వెళ్దాం పదండి అంటుంది వసుధర. తనను చూసి అలాగే నిలిచిపోతాడు రిషి.

guppedantha manasu 18 november 2022 full episode

guppedantha manasu 18 november 2022 full episode

తనకు బొట్టు పెడతాడు. చూసుకో.. బొట్టు పెట్టుకోవడం మరిచిపోయావు అంటాడు. దీంతో థాంక్యూ సార్ అంటుంది వసుధర. ఆల్ ది బెస్ట్. ఎవరు వచ్చినా రాకపోయినా నీ విజయం చెక్కు చెదరదు. నీ కష్టానికి ఫలితం అది. నువ్వు అందరికీ స్ఫూర్తినిచ్చేలా గొప్ప విజయాన్ని సాధించావు. అది గుర్తు పెట్టుకో అంటాడు రిషి. మనసులో నుంచి అన్నీ తీసేయ్ అంటాడు. ధైర్యంగా ఇంటర్వ్యూ ఫేస్ చేయి అంటాడు. మేడమ్ వస్తుంది కదా అంటుంది వసుధర. దీంతో ఎవరు వచ్చినా రాకపోయినా కొన్ని జరుగుతుంటాయి. ఇది కూడా అంతే అనుకో. నీ వెనకాల నేను ఉన్నాను అంటాడు రిషి. దీంతో సార్ మీరు ఎప్పటికీ నాకు తోడుగా ఉంటారు. ఈ విషయం నాకు తెలుసు కానీ.. మనసులో జగతి మేడమ్ వస్తే బాగుండు అని చిన్న కోరిక మిగిలి పోయింది అంటుంది వసుధర. తన చేతులు పట్టుకొని మాట్లాడుతుండగా చూసిన దేవయాని.. నాన్నా రిషి అంటుంది. మీ పెదనాన్న గారు వెళ్లారు అంటుంది దేవయాని. దీంతో సరే పెద్దమ్మ అంటాడు. ఆ తర్వాత వసుధరకు ఆల్ ది బెస్ట్ చెప్పరా పెద్దమ్మ అంటాడు. దీంతో ఆల్ ది బెస్ట్ వసుధర అంటుంది.

నా ఇంట్లోనే ఉంటూ రిషితో క్లోజ్ గా తిరుగుతున్నా నేను ఏం చేయలేకపోతున్నాను అని బాధపడుతుంది దేవయాని. మరోవైపు కాలేజీలో ఇంటర్వ్యూకు ఏర్పాట్లు జరుగుతుంటాయి. వసుధార, రిషి కాలేజీకి వెళ్తారు. వసుధార మీడియా వాళ్లతో ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అయ్యావా అని అడుగుతాడు రిషి.

దీంతో ప్రిపేర్ అయ్యేది ఏముంది సార్. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంతే కదా అంటుంది వసుధార. పెదనాన్న ఒక చిన్న పని ఉంది మేము ఇప్పుడే వస్తాం అని వసుధారను తీసుకొని వెళ్తాడు రిషి. ఇంతలో గౌతమ్ కు ఫోన్ చేస్తాడు మహీంద్రా.

కానీ.. గౌతమ్ తన ఫోన్ ను అక్కడ మరిచిపోతాడు. ఆ ఫోన్ ను రిషి పెదనాన్న చూస్తాడు. ఆ ఫోన్ ను ఎత్తుతాడు. ఎవరు అంటాడు. దీంతో అన్నయ్య గొంతులా ఉందేంటి అని అనుకుంటాడు. రిషి పెదనాన్న మహీంద్రా గొంతులా ఉందేంటి అని అనుకుంటాడు. వెంటనే మహీంద్రా ఫోన్ కట్ చేస్తాడు.

గౌతమ్ ఫోన్ అన్నయ్య తీశాడు ఏంటి.. అన్నయ్య నా గొంతు గుర్తుపట్టి ఉంటాడా? అని అనుకుంటాడు. ఇంతలో గౌతమ్ వస్తాడు. గౌతమ్ ఇందాక నీకు ఏదో ఫోన్ వచ్చింది. ఆ వాయిస్ మహీంద్రా వాయిస్ లా అనిపించింది అని అంటాడు. ఇంతలో రిషి, వసుధార వస్తారు.

Guppedantha Manasu 18 Nov Today Episode : మహీంద్రాకు తిరిగి ఫోన్ చేసిన రిషి.. ఏం మాట్లాడని మహీంద్రా

ఏంటి పెదనాన్న డాడ్ పేరు వినిపించింది అంటాడు రిషి. దీంతో గౌతమ్ కు వచ్చిన ఫోన్ లో గొంతు మన మహీంద్రాదిలా అనిపించింది అంటాడు రిషి పెదనాన్న. దీంతో అవునా.. ఆ ఫోన్ ఇటు ఇవ్వు అని ఆ ఫోన్ ను తీసుకోబోతాడు. ఇంతలో అది మన మహీంద్రా గొంతు కాకపోవచ్చు. నేను పొరపాటు పడి ఉంటాను అంటాడు.

దీంతో అలా ఎందుకు అనుకోవాలి. డాడ్ ఎవరికైనా చేయొచ్చు కదా అని అనుకొని వెంటనే గౌతమ్ ఫోన్ తీసుకొని ఆ నెంబర్ కు కాల్ చేస్తాడు రిషి. ఇంతలో ఫోన్ మహీంద్రా ఎత్తుతాడు. హలో.. ఇందాక కాల్ చేశారు కదా.. హలో ఎవరండి మాట్లాడేది అని అంటాడు.

కానీ.. మహీంద్రా మాట్లాడడు. ఇంతలో గౌతమ్ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు మేడమ్ వస్తారా రారా అని అనుకుంటుంది వసుధార. గౌతమ్ తో మాట్లాడుదాం అనగానే ఎక్కడికో బిజీగా వెళ్తుంటాడు గౌతమ్. మరోవైపు బయట కూర్చొని జగతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వసుధార.

ఇంతలో అక్కడికి వచ్చిన రిషి.. వసుధార ఏంటి లేట్ వెళ్దాం పదా అంటాడు. మేడమ్ గురించి ఆలోచిస్తున్నావా అంటాడు. మేడమ్ వస్తారనే నేను ఈ ఇంటర్వ్యూకు ఒప్పుకున్నాను.. అంటుంది వసుధార. జగతి మేడమ్ వస్తారో రారో అని ఆలోచించకు. మేడమ్ వస్తారనే నమ్ముదాం. ఆ నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా మేడమ్ వస్తారు అంటాడు.

కట్ చేస్తే జగతి ఒక లెటర్ రాసి వెళ్లిపోతుంది. వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. వెళ్లడం తప్పడం లేదు. నన్ను క్షమించు మహీంద్రా అని లెటర్ రాసి జగతి వెళ్లిపోతుంది. దీంతో మహీంద్రాకు ఏం చేయాలో అర్థం కాదు. ఇలా వెళ్తావని నేను అనుకోలేదు అని అనుకుంటాడు రిషి.

మరోవైపు తన క్యాబిన్ కు వసుధారను తీసుకొని వెళ్తాడు రిషి. ఏంటి నిలుచుకున్నావు. కూర్చో వసుధార అంటాడు. చూడు వసుధార. జగతి మేడమ్ వస్తారు అంటాడు రిషి. ఇప్పటికే చాలా సమయం అయింది కదా సార్ అంటంది వసుధార. అయితే అవనీ.. ఇంకా మీడియా వాళ్లు రావడానికి టైమ్ ఉంది కదా అంటాడు రిషి.

నువ్వు ఈ ఇంటర్వ్యూను ఆనందంగా ఫేస్ చేస్తున్నావు. జగతి మేడమ్ ఖచ్చితంగా వస్తారు అంటాడు రిషి. వసుధార.. నువ్వు ఇలా మూడీగా ఉండకు. ఇంటర్వ్యూ కూడా ఇలాగే ఇస్తావా ఏంటి. నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను. నేనే రిపోర్టర్ అనుకో. ఇదే ఒరిజినల్ ఇంటర్వ్యూ అనుకో. సమాధానాలు సరిగ్గా చెప్పాలి సరేనా అంటాడు రిషి.

కంగ్రాట్స్ వసుధార గారు. యూనివర్సిటీ టాపర్ గా నిలిచారు. ఈ విజయం సామ్యానమైనది కాదు. మీ విజయం వెనుక ఎవరు ఉన్నారు అని అడుగుతాడు రిషి. దీంతో నా విజయం వెనుక ఇద్దరు ఉన్నారు అంటుంది వసుధార. ఆ ఇద్దరు ఎవరో చెప్పండి అంటాడు రిషి.

దీంతో జగతి మేడమ్.. తను నాకు గురువు. తను నాకు గైడ్ అంటూ చెబుతుంది వసుధార. ఇంతలో జగతి మేడమ్ కాలేజీలో అడుగుపెడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది