Guppedantha Manasu 19 Oct Today Episode : వసుధర, జగతికి షాక్ ఇచ్చిన రిషీ.. వసుధరను రిషీ పట్టించుకోకపోవడంతో ఏం చేస్తుందంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 19 Oct Today Episode : వసుధర, జగతికి షాక్ ఇచ్చిన రిషీ.. వసుధరను రిషీ పట్టించుకోకపోవడంతో ఏం చేస్తుందంటే?

Guppedantha Manasu 19 Oct Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 19 అక్టోబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వ్యూలో అందరి గురించి గొప్పగా చెబుతాడు. తన పెదనాన్న, తండ్రి గురించి చెబుతాడు రిషి. ఇంటర్వ్యూను జగతి, వసుధర కూడా చూస్తుంటారు. మా తాత గారి అడుగు జాడల్లో నడుస్తున్నాం అని చెబుతాడు రిషి. […]

 Authored By gatla | The Telugu News | Updated on :19 October 2021,3:30 pm

Guppedantha Manasu 19 Oct Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 19 అక్టోబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వ్యూలో అందరి గురించి గొప్పగా చెబుతాడు. తన పెదనాన్న, తండ్రి గురించి చెబుతాడు రిషి. ఇంటర్వ్యూను జగతి, వసుధర కూడా చూస్తుంటారు. మా తాత గారి అడుగు జాడల్లో నడుస్తున్నాం అని చెబుతాడు రిషి.

guppedantha manasu 19 october 2021 full episode

guppedantha manasu 19 october 2021 full episode

ఈ మిషన్ ఎడ్యుకేషన్ ఆలోచన మీకు వచ్చిందేనా.. అని అడుగుతుంది యాంకర్. నిజం చెప్పాలంటే ఇది నా ఆలోచన కాదు. నేనీ కార్యక్రమంలో ఒక కార్యకర్తను. ఒక వాలంటీర్ ను మాత్రమే అంటాడు రిషీ. ఈ ఆలోచన మా ఫ్యాకల్టీ హెడ్ జగతి మేడమ్ గారిది అని చెబుతాడు రిషీ. దీంతో అందరూ షాక్ అవుతారు. ఈ సక్సెస్ వెనుక జగతి మేడమ్, మా స్టూడెంట్ వసుధర.. ఇంకా మా వాలంటీర్స్, స్టూడెంట్స్ అందరూ ఉన్నారని చెబుతాడు రిషీ. థాంక్యూ.. అని చెప్పి ఇంటర్వ్యూను ముగిస్తాడు రిషీ.

దీంతో దమయంతి చిరాకు పడుతుంది. ఇంతలో ధరణి వచ్చి అత్తయ్య గారు పిలిచారా? అని అడుగుతుంది. చూడు.. నువ్వు తెలివైన దానివో.. తెలివితక్కువ దానివో నాకు అర్థం కావడం లేదు ధరణి. భగవంతుడా.. ధరణి.. నువ్వు నన్ను సైలెంట్ గా చంపేస్తున్నావు. అసలే నేను చిరాకులో ఉన్నాను.. అంటుంది దమయంతి. నీకు దండం పెడతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది దమయంతి.

Guppedantha Manasu 19 Oct Today Episode : అసలు నేను గెలిచానా? లేక గెలిపించబడ్డానా? అని ఆలోచించిన రిషీ

ఆ తర్వాత రిషీ ఒక్కడే ఆలోచిస్తాడు. నేను గెలిచానా.. గెలిపించబడ్డానా? నేను గెలిస్తే నాకు ఎందుకు ఆనందం రావడం లేదు.. అని అనుకుంటాడు. కారులో ఎక్కడికో బయలుదేరుతాడు. ఇంతలో జగతి మేడమ్ వస్తుంది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావ్ అని అడుగుతుంది వసుధర. ఎక్కడికి వెళ్లారు.. అంటే నువ్వు ఉండలేదు ఎందుకు అని జగతి వసుధరను ప్రశ్నిస్తుంది. మీరు లేకుంటే నేనెందుకు అక్కడ అంటుంది వసుధర. అక్కడ రిషి, మహీంద్రను వదిలేసి వచ్చి నువ్వు నాకోసం బాధపడుతున్నావా.. ఉండాలి కదా వసు అనగానే అంతలోనే రిషి అక్కడికి వస్తాడు. మీరు లేకపోతే మీ ప్రియమైన శిష్యురాలు ఎలా ఉంటారు మేడమ్ అని అంటాడు రిషీ. మీరు లేకపోతే మీ శిష్యురాలు అక్కడ ఎలా ఉంటారు మేడమ్ అంటాడు. మీరు సూపర్.. మీ శిష్యురాలు డబుల్ సూపర్.. అనగానే సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటే లేదు ఇప్పుడే కరెక్ట్ గా అర్థం చేసుకుంటున్నాను.. అంటాడు రిషీ.

guppedantha manasu 19 october 2021 full episode

guppedantha manasu 19 october 2021 full episode

ఈ విజయం మీదే నాది కాదు. నాకు ఉచితంగా వచ్చేది అవసరం లేదు అని రిషీ వాళ్లకు చెప్పేలోపు.. మహీంద్రా అక్కడికి వస్తాడు. అక్కడ జగతి, వసుధరను చూస్తాడు మహీంద్రా. మహీంద్రా మాట్లాడుతుండగానే రిషీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో మహీంద్రా షాక్ అవుతాడు. మరోవైపు దేవయాని.. రిషీని పొగడ్తల్లో ముంచెత్తుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది