Guppedantha Manasu 20 Aug Today Episode : రిషి గురించే ఆలోచిస్తూ ఎగ్జామ్స్ పై దృష్టి పెట్టని వసుధర.. యూనివర్సిటీ టాపర్ గా వసుధర నిలుస్తుందా? రిషి ఏం చేస్తాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 20 Aug Today Episode : రిషి గురించే ఆలోచిస్తూ ఎగ్జామ్స్ పై దృష్టి పెట్టని వసుధర.. యూనివర్సిటీ టాపర్ గా వసుధర నిలుస్తుందా? రిషి ఏం చేస్తాడు?

Guppedantha Manasu 20 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 ఆగస్టు 2022, శనివారం ఎపిసోడ్ 534 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధరను ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని అంటాడు రిషి. దీంతో తను గోల్డ్ లెక్కలను వేస్తుంది. ఈ లెక్కలు ఏంటి.. ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఎగ్జామ్స్ అప్పుడు అరిస్తే డిస్టర్బ్ అవుతుంది అని అనుకుంటాడు రిషి. సరే వెళ్లు అంటాడు రిషి. […]

 Authored By gatla | The Telugu News | Updated on :20 August 2022,10:00 am

Guppedantha Manasu 20 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 ఆగస్టు 2022, శనివారం ఎపిసోడ్ 534 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధరను ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని అంటాడు రిషి. దీంతో తను గోల్డ్ లెక్కలను వేస్తుంది. ఈ లెక్కలు ఏంటి.. ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఎగ్జామ్స్ అప్పుడు అరిస్తే డిస్టర్బ్ అవుతుంది అని అనుకుంటాడు రిషి. సరే వెళ్లు అంటాడు రిషి. మీ రింగ్ కోసమే కదా సార్ నేను ఆలోచించేది అని అనుకుంటుంది వసుధర. ఆ లెక్కలేంటో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటాడు రిషి. మరోవైపు జగతి, మహీంద్రా ఇద్దరూ స్టాఫ్ రూమ్ లో కూర్చొంటారు. ఇంతలో గౌతమ్ వస్తాడు. జగతి.. ఒక్కోసారి కారు డ్రైవింగ్ అనేది మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కదా అంటాడు మహీంద్రా. దీంతో అంకుల్ మీకు కారు డ్రైవింగ్ అంటే ఇష్టమా అని అడుగుతాడు గౌతమ్. అవును.. కారు డ్రైవింగ్ అంటే ఇష్టం అంటాడు మహీంద్రా.

guppedantha manasu 20 august 2022 full episode

guppedantha manasu 20 august 2022 full episode

అంకుల్.. అంతుపట్టనిది అని మీరు అంటే నాకు అనిపించింది. ఈ రోజు రిషి మూడ్ ఎలా ఉంటుంది అంటారు అంటాడు గౌతమ్. దీంతో అక్కడక్కడ చిరు జల్లులు పడవచ్చు కానీ.. అప్పుడప్పుడు రిషి కోపంతో ఉండొచ్చు. వర్షం గురించి చెప్పొచ్చు కానీ.. రిషి గురించి మాత్రం చెప్పలేం అంటాడు మహీంద్రా. ఇంతలో జగతి కల్పించుకొని కాలేజీ ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నాయి. రిషి ప్రస్తుతం ఆ టెన్షన్ లో ఉన్నాడు అంటుంది జగతి. ఇంతలో వసుధర వెళ్తూ ఉంటుంది. తను ఏదో ఆలోచించుకుంటూ వెళ్తుంటుంది. గౌతమ్ పిలిచినా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. ఏమైంది అంకుల్.. వసుధర పిలిచినా కూడా పట్టించుకోకుండా వెళ్తుంది. మళ్లీ వీళ్లు ఏమైనా గొడవ పెట్టుకున్నారా అంటాడు. దీంతో ఏమో అంటాడు. తర్వాత గౌతమ్ వెళ్లిపోతాడు. జగతి, మహీంద్రా ఇద్దరూ మీటింగ్ కు వెళ్తారు.

ఇంతలో మీటింగ్ కు వెళ్తారు. రిషి మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. రాబోయే ఫైనల్ ఎగ్జామ్స్ కు మనం ముందుగా మానసికంగా సిద్ధం కావాలి. ఎగ్జామ్స్ అంటే స్టూడెంట్స్ లో ఉన్న భయాన్ని పోగొట్టాలి. ఆ భయం పోతే స్టూడెంట్స్ పాస్ అయినట్టే అంటాడు రిషి. ర్యాంకులు అంటూ స్టూడెంట్స్ ను ప్రెజర్ పెట్టొద్దు అంటాడు.

Guppedantha Manasu 20 Aug Today Episode : గౌతమ్ వసుధరతో మాట్లాడటం చూసిన రిషి

స్ట్రిక్ట్ ఎగ్జామ్ సెంటర్ గా మనకు మంచి రెప్యూటేషన్ ఉంది. దాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటాడు రిషి. అలాగే మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మనకందరూ ముఖ్యమే. ఏ చిన్న అవకాశం దొరికినా స్టూడెంట్స్ లో ఆత్మవిశ్వాసం నింపండి అంటాడు.

మీటింగ్ అయిపోయింది అంటాడు. జగతిని మాత్రం ఉండమంటాడు రిషి. బయట.. గౌతమ్ వసుధరతో మాట్లాడటం చూస్తాడు రిషి. మేడమ్ మీరు మీ స్టూడెంట్ కు ఒక మాట చెప్పాలి అంటాడు రిషి. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. వసుధరలో మునుపటి శ్రద్ధ కనిపించడం లేదు అంటాడు రిషి.

వసుధర తనకు తాను ఏమనుకుంటుందో తెలియదు కానీ.. తను ఈ కాలేజీకి గౌరవం తెచ్చింది. అలాంటిది చేతుల మీద ఏదేదో రాసుకుంటోంది. క్లాస్ రూమ్ లో ఏకాగ్రతగా కనిపించడం లేదు. తను యూత్ కు ఐకాన్. తను ఆదర్శంగా ఉండాలి. తన లక్ష్యం ఏమౌతుందో చెప్పండి.. అంటాడు రిషి.

తను యూత్ ఐకాన్ కంటే ముందు ఒక సగటు ఆడపిల్ల. తనకంటూ కొన్న ఆశలు, ఊహలు ఉంటాయి కదా. తను బ్రిలియంట్. తన లక్ష్యం కంటే ముందు తన లైఫ్ ముఖ్యం అనుకుంటుందేమో అంటుంది జగతి. దీంతో ముందు చదువు మీద దృష్టి పెట్టమని చెప్పండి.

తను అనుకున్న లక్ష్యం.. యూనివర్సిటీ టాపర్ అవ్వాలని. తను కోరుకున్న రీతిలో చదవాలంటే బాగా చదవాలి. మీరైనా చెప్పండి అంటాడు రిషి. మరోవైపు సాక్షిని కలుస్తుంది దేవయాని. రిషి ఉంగరం మీద వీ అనే అక్షరం రాయించడమే ఇంకా నా కళ్ల ముందు కదలాడుతోంది అంటుంది సాక్షి.

దీంతో జీవితం అనేది మనకు నచ్చినట్టుగా సాగదు అంటుంది దేవయాని. అప్పుడు అనవసరంగా ఆవేశపడ్డావు. రిషి లాంటి వాడిని వదులుకున్నావని నీకు అర్థం అవుతోందా? రిషి కోసం ఇన్నేళ్లు ఆరాటపడ్డావు. ఎదురు చూశావు. రిషితో జీవితాన్ని పంచుకోవాలని చూశావు. ఇప్పుడు ఇలా చేశావు అంటుంది దేవయాని.

మరోవైపు వసుధర పనిచేసే రెస్టారెంట్ కు వెళ్తాడు రిషి. అక్కడ వసుధర కనిపించదు. తన ఓనర్ ను పిలిచి అడుగుతాడు. దీంతో వసుధర 10 వేలు కావాలని అడిగింది అంటాడు. ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే రిషి చేయించిన రింగ్ ను చూసుకుంటూ మురిసిపోతుంది. మెడకు కట్టుకుంటుంది వసుధర. ఇంతలో తన ఇంటికి వస్తాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది