Ram Gopal Varma : ఆ పూరీ జగన్ గాడికి ఏమైంది..ఇలాంటి చెత్త సినిమాలు తీస్తున్నాడు.. వర్మ ఫైర్
Ram Gopal Varma : పూరీ జగన్నాథ్… ఈ డైరెక్టర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు మంచి సినిమాలు తీసిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వచ్చింది.అటు పూరీ జగన్నాథ్ అభిమానులను ఇటు విజయ్ దేవరకొండ అభిమానులను పూర్తిస్థాయిలో మెప్పించేలా ఈ సినిమా లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లైగర్ సినిమా ఫలితంతో పూరీ జగన్నాథ్ కు స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభపై నెగిటివ్ కామెంట్లు చేయలేమని అయితే ఇతర రచయితలు రాసిన కథలను పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
Ram Gopal Varma : వర్మ ఏంది ఇలా అన్నాడు..
తాజాగా పూరీ జగన్నాథ్ ని భారీగా బూతులు తిడుతూ సంచలన కామెంట్స్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సాలె, బాడ్ కౌ అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నాడు. ఒకప్పుడు మంచి సినిమాలు తీసే అతను ఇప్పుడు ఇలా తయారయ్యాడు అంటూ దారుణంగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పూరీ జగన్నాథ్ బలం డైలాగులు.. ఆయన మాస్ పంచ్ డైలాగులు హీరో చెప్తుంటే థియేటర్‌లో ఈలలు గోలలు పడుతుంటాయి. కానీ లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు నత్తి పెట్టి తన బలాన్ని తనే చంపేసుకున్నాడు పూరీ.
పోనీ హీరో క్యారెక్టరైజేషన్ ఇంతకు ముందు సినిమాల మాదిరి బలంగా ఉందా అంటే అదీ లేదు. అసలు కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఈ సినిమా చేసింది నిజంగా పూరీ జగన్నాథేనా అనే అనుమానం కూడా వస్తుంది అంటున్నారు అభిమానులు. లైగర్‌తో పాన్ ఇండియా స్థాయిలో రఫ్ఫాడిస్తాడు అనుకుంటే అసలుకే మోసం తీసుకొచ్చాడు అంటూ పూరీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.పవిత్ర పూరి ఈ విధంగా తన వివరణ ఇచ్చింది.. నాన్న ఇప్పుడు నువ్వు నా ఫేవరెట్ లవ్. నేను ఎప్పుడూ కూడా ఇంత నర్వస్ గా ఫీల్ కాలేదు. ఎందుకంటే లైగర్ రిలీజ్ రోజు నీకు ఒక బిగ్ డే. ఈరోజు కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు దక్కుతుందిమ్ ఏదేమైనా ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి. మేము మీ ప్రతి విషయంలో కూడా చాలా గర్వంగా ఉంటాము నీకోసం ఇంటిదగ్గర ఎదురుచూస్తూ ఉంటాము.. అని పేర్కొన్నారు
