Guppedantha Manasu 29 Nov Today Episode : జగతికి తప్పిన ప్రాణాపాయం.. రిషి గురించి అసలు నిజం తెలుసుకొని వసుధార షాక్.. మహీంద్రా, జగతి.. రిషి ఇంటికి వెళ్తారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 29 Nov Today Episode : జగతికి తప్పిన ప్రాణాపాయం.. రిషి గురించి అసలు నిజం తెలుసుకొని వసుధార షాక్.. మహీంద్రా, జగతి.. రిషి ఇంటికి వెళ్తారా?

Guppedantha Manasu 29 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 నవంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 620 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహీంద్రా, జగతి మేడమ్ వాళ్లు ఇంటికి తిరిగి వస్తున్నారా? వాళ్లకు ఎలా ఉంది అని ఇంటికి వచ్చిన ఫణీంద్రాను ధరణి అడుగుతుంది. దీంతో అవును.. వస్తున్నారు అని చెబుతున్నాడు. దీంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది ధరణి. వస్తారు.. రాక ఎటు […]

 Authored By gatla | The Telugu News | Updated on :29 November 2022,9:00 am

Guppedantha Manasu 29 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 నవంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 620 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహీంద్రా, జగతి మేడమ్ వాళ్లు ఇంటికి తిరిగి వస్తున్నారా? వాళ్లకు ఎలా ఉంది అని ఇంటికి వచ్చిన ఫణీంద్రాను ధరణి అడుగుతుంది. దీంతో అవును.. వస్తున్నారు అని చెబుతున్నాడు. దీంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది ధరణి. వస్తారు.. రాక ఎటు పోతారు అని దేవయాని అక్కడికి వచ్చి అంటుంది. వాళ్లు ఇక్కడికి కాక ఇంకెక్కడికి వెళ్తారు అని అంటాడు ఫణీంద్రా. అయినా వాళ్లు ఎందుకు వెళ్లారో.. ఎక్కడికి వెళ్లారో అని నేను అడుగుతాను అంటాడు ఫణీంద్రా. దీంతో దేవయాని టెన్షన్ పడుతుంది. ఇంతలో ఫణీంద్రా ఫోన్ వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

guppedantha manasu 29 november 2022 full episode

guppedantha manasu 29 november 2022 full episode

దేవయాని వైపే అలా చూస్తున్న ధరణిని ఏమైంది ధరణి.. అలా చూస్తున్నావు అని అడుగుతుంది. దీంతో వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం మీరే అని మామయ్యకు తెలుస్తుందేమో అని అంటుంది. దీంతో కోపంతో నేనెందుకు కారణం.. వాళ్లు వెళ్లడానికి నాకేం సంబంధం లేదు అంటుంది దేవయాని. నువ్వు, నేను ఫ్రెండ్స్.. ఇవన్నీ మరిచిపో అంటుంది దేవయాని. దీంతో సరే అంటుంది ధరణి. మరోవైపు ఆసుపత్రిలో జ్యూస్ తాగండి అని వసు.. జగతికి ఇస్తుంది. దీంతో జ్యూస్ తాగుతుంది. మీరు త్వరగా బాగవ్వాలంటే బాగా తినాలి. ఇలా జ్యూస్ లు తాగాలి అంటుంది వసుధార.

తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకుంటారు. మనసు ఆరాటపడితే సరిపోదు.. కొన్నింటికి టైమ్ రావాలి. అప్పుడే అవి జరుగుతాయేమో కదా అని అంటుంది జగతి. దీంతో మేడమ్.. మీరు ఈ మధ్య మాటలు, ఆలోచనలు సరిగ్గా అర్థం కావడం లేదు. మీ మనసులో ఏ ముందో ఇంతకుముందు తెలిసిపోయేది. ఇప్పుడు తెలియడం లేదు. మీరు ఎందుకు వెళ్లారో.. రిషి సార్, నన్ను ఎందుకు ఇలా బాధపెట్టారో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అంటుంది వసుధార.

దీంతో కొన్ని ప్రశ్నలకు మనం వెంటనే సమాధానం చెప్పలేం. ఎందుకు, ఏంటి అని అడగొద్దు వసు అంటుంది జగతి. దీంతో మీరు వెళ్లారు కానీ.. అక్కడ ఎంత కష్టపడుతున్నారో అని రిషి సార్, నేను చాలా బాధపడ్డాం. మేము ఇక్కడ ఎంత బాధపడుతున్నామో అని మీరు ఎప్పుడూ ఆలోచించలేదా మేడమ్ అంటుంది వసుధార.

Guppedantha Manasu 29 Nov Today Episode : ఎక్కడికెళ్లారంటూ జగతిని ప్రశ్నించిన వసుధార

మేము ఇక్కడి నుంచి వెళ్ళేముందు ఎంత బాధను అనుభవించామో నీకేం తెలుసు అంటుంది జగతి. దీంతో ఎందుకు మేడమ్ ఇదంతా మీ మనసును ఎవరైనా నొప్పించారా? మేము వెళ్లడానికి మేము ఏమైనా కారణమా అని అడుగుతుంది వసుధార.

దీంతో అయిందేదో అయిపోయింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అంటుంది జగతి. దీంతో ఏం బాగుంది మేడమ్.. రిషి సార్.. మహీంద్రా సార్ ను వదిలి హాస్పిటల్ నుంచి బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడ మహీంద్రా సార్ తనకు దూరం అవుతారో అని టెన్షన్ పడుతున్నారు.

రిషి సార్ దగ్గర నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. ఎన్ని కాల్స్ చేశాం. ఎన్ని మెయిల్స్ పెట్టాం. ఏ ఒక్క దానికి మీరు సమాధానం ఇవ్వలేదు. వసుధార డాడ్ మళ్లీ వస్తారా అని ప్రతిసారి రిషి సార్ నన్ను అడుగుతుంటే నాకు కూడా మనసులో వస్తారో రారో అనే టెన్షన్ ఉండేది.

ఒకవేళ వెళ్లాలనే నిర్ణయం మహీంద్రా సార్ దే అయినా మీరైనా వద్దని చెప్పాలి కదా అంటుంది. మహీంద్రా నిర్ణయానికి నేను ఎదురు చెప్పాలా అంటుంది జగతి. నేను తన భార్యను వసు. ఇంగ్లీష్ లో భార్య అనే పదానికి వైఫ్ అని ఇంకా రెండు మూడు పదాలే ఉన్నాయి. కానీ.. తెలుగులో చాలా పదాలు ఉన్నాయి. అర్ధాంగి, జీవిత భాగస్వామి, ధర్మపత్రి, పెళ్లాం.. ఇలా ఎన్నో ఉన్నాయి కదా.

వాటన్నింటికీ అర్థవంతమైన అర్థాలు ఉంటాయి. భర్త తీసుకునే నిర్ణయానికి భార్య కొన్ని సార్లు ఎదురు చెప్పలేదు.. చెప్పకూడదు. పెళ్లి భర్త నాతిచరామి అంటాడు. భార్య అనకపోయినా దాన్ని పాటించి తీరాలి. భర్త కష్టాల్లో భార్య పాలు పంచుకోవాలి.

కొన్ని సార్లు వాళ్ల నిర్ణయాలు తప్పు కావచ్చు కానీ.. భార్యగా భర్తకు బాసటగా నిలవాల్సిన బాధ్యత ఆమెది. ఇవన్నీ ఇప్పుడు నీకు తెలియదు. రేపు నీకు పెళ్లి అయ్యాక తెలుస్తుంది. ఇవన్నీ చెబుతున్నా కదా. మహీంద్రాను వదిలేసి ఎందుకు వెళ్లాను అని నీ మనసులో అనుకోవచ్చు.

కానీ.. నేను వెళ్లలేదు.. వెళ్లగొట్టబడ్డాను అని అంటుంది. విడాకుల పత్రాన్ని దేవయాని అప్పట్లో జగతికి చూపించిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఒక రోజు, రెండు రోజులు, నెలలు, సంవత్సరాలు దూరంగా ఉన్నాను. రిషి చిన్నప్పుడు తను ఏం అడిగినా నేను కాదనలేకపోయేదాన్ని.

ఏది అడిగినా కొనిచ్చేదాన్ని. రిషికి అయితే.. కాదు అన్నమాట నా నోటికి రాదు. అందకే రిషి నాకు ఇంటర్వ్యూ రోజు రమ్మని మెయిల్ చేస్తే ఆగలేక వచ్చేశాను అంటుంది జగతి. మేడమ్.. రిషి సార్ మీకు రమ్మని మెయిల్ చేశారా అంటుంది వసుధార.

మేడమ్.. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. రిషి సార్ మిమ్మల్ని రమ్మన్నారా? నాకోసం మిమ్మల్ని పిలిచారా? ఈ విషయం నాకు రిషి సార్ చెప్పనే లేదు. ప్రతి కష్టంలో నాకు తోడుగా ఉన్న రిషి సార్.. నేను ఇంటర్వ్యూ రోజు మీరు రాలేదని టెన్షన్ పడుతుంటే మిమ్మల్ని రప్పించారా? అంటుంది.

నాకు అన్నీ తనే. అలాంటి రిషి సార్ ను నాకు అందించినందుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను మేడమ్. థాంక్యూ మేడమ్ అంటుంది వసుధార. తర్వాత మహీంద్రా, రిషి ఇద్దరూ లోపలికి వస్తారు. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అయిపోయాయి అని అంటాడు గౌతమ్ వచ్చి.

దీంతో బిల్ పే చేశారా అని అడుగుతాడు రిషి. దీంతో అదొక్కటే పెండింగ్ ఉంది. బిల్ రెడీ అవుతోంది అంటాడు గౌతమ్. దీంతో నా కార్డుతో పే చేయ్ అంటాడు రిషి. దీంతో జగతి చాలా సంతోషిస్తుంది. మేడమ్.. ఇంటికి వెళ్లాక మీకు అవసరం అయితే ఒక నర్సును పిలిపిద్దాం అంటాడు రిషి.

నీకోసం, నీ ఆనందం కోసం రిషి నన్ను రమ్మన్నాడు వసు. రిషి నాకు దూరమైనా అదృష్టం. నువ్వెప్పుడూ రిషిని వదులుకోకు అని మనసులో అనుకుంటుంది జగతి. రిషి సార్.. వెలకట్టలేని వజ్రం. ఈ జెంటిల్ మెన్ ను ఎప్పటికీ వదులుకోను అని మనసులో అనుకుంటుంది వసుధార. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది