Guppedantha Manasu 6 Dec Today Episode : వనభోజనాలకు జగతి వెళ్లకుండా ప్లాన్ వేసిన దేవయాని.. రిషి, వసుధారను కూడా వెళ్లకుండా ఆపుతుందా? ఈ విషయం రిషికి తెలుస్తుందా?
Guppedantha Manasu 6 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 డిసెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 626 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి.. గౌతమ్ ను క్షమించాడు అది చాలు అని అనుకుంటుంది జగతి. మరోవైపు రిషి.. ధరణి దగ్గరికి వెళ్తాడు. రిషి ఏమైనా కావాలా అని అడుగుతుంది. కాఫీ, టీ.. కాదు జ్యూస్ అంటాడు రిషి. దీంతో నీకు ఏం కావాలో నాకు అర్థం అయింది. వసుధార ఇప్పుడే తన గదిలోకి వెళ్లింది అంటుంది ధరణి. దీంతో అక్కడి నుంచి వెళ్తాడు రిషి. వసుధార తన గదిలో డ్రెస్సులను ఇస్త్రీ చేసుకుంటూ ఉంటుంది. మొత్తానికి రిషి సార్ మనసు తేలికైంది చాలు. ఇప్పుడు రిషి సార్ ఏం చేస్తున్నారో. రిషి సార్ కోపం తగ్గించుకుంటే బాగుంటుంది కానీ.. ఏం లాభం. ముక్కు మీదే కోపం. అసలు జగతి మేడమ్ కు కోపం లేదు. మహీంద్రా సార్ కు కోపం లేదు. మరి.. రిషి సార్ కు కోపం ఎలా వచ్చిందో ఏంటో అని అనుకుంటుండగా రిషి వచ్చి అన్నీ వింటాడు. వాళ్ల తాతగారికి కోపం ఉంటుందేమో అది రిషి సార్ కు వచ్చి ఉంటుంది.
అయినా పర్లేదులే రిషి సార్ కోపాన్ని కూడా నేను భరిస్తాను. అప్పుడప్పుడు కోపం కూడా బాగానే ఉంటుంది అని అనుకుంటుంది వసుధార. వసుధార.. ఏంటిది. నీకస్సలు భయం లేకుండా పోతుంది కదా. నేను రిషిని. రిషేంధ్ర భూషణ్ ను ఇక్కడ అంటూ వెనక్కి తిరిగి రిషిని చూసి షాక్ అవుతుంది. ఏంటి.. ఏమంటున్నావు చెప్పు చెప్పు. పర్లేదు. నాకోపం గురించి ఏదో అంటున్నావు కదా. పర్లేదు చెప్పు అంటాడు రిషి. ఇంతలో అది అంటూ.. తన చేతుల్లో ఉన్న ఇస్త్రీని పక్కకు పెట్టబోయే సరికి రిషి చేతికి తాకి కాలుతుంది. బాగా కాలిందా. వెన్నపూస తెచ్చి రాయమంటారా? అంటుంది వసుధార. అంతా నావల్లనే కదా సార్ అంటూ కాలిన చోట ఊదుతూ ఉంటుంది వసుధార. దీంతో నాకేం కాలేదు వద్దు అంటాడు రిషి. అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి.. అని అడుగుతుంది. దీంతో వస్తే పిలవాలి కదా అంటుంది వసుధార.
ఇంకోసారి పిలవకుండా రాకండి. చిన్నగా కాలిపోయింది కాబట్టి సరిపోయింది అంటుంది వసుధార. గాయం మీకు అయినా నొప్పి నాకే ఉంటుంది తెలుసా అంటుంది. దీంతో వసుధార నువ్వు ఎక్కువగా బాధపడకు. నాకేం కాలేదని చెబుతున్నా కదా. అని చెప్పి బాధపడకు అంటాడు.
ఇంతలో రిషికి ఫోన్ వస్తుంది. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అంటాడు రిషి. ఇంతలో మహీంద్రాకు మంత్రి వ్యక్తి ఫోన్ చేసి జరిగిన విషయం గురించి తెలిసింది. అందరి ఆశీర్వాదాలతో క్షేమంగా బయటపడ్డారు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నాం అని అంటాడు. దీంతో మీరు, మీ కాలేజీ స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ తప్పకుండా రావాలి అంటాడు.
కానీ.. మహీంద్రా ఎందుకో తడబడతాడు. మీకు ఇబ్బంది లేకుంటేనే రండి. అందరూ వస్తే నేను చాలా సంతోషిస్తాను అంటాడు. రిషి, ఫణీంద్రాను కూడా ఆహ్వానించినట్టు నా మాటగా చెప్పండి అని అంటాడు. దీంతో సరే సార్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు. మరోవైపు గౌతమ్, రిషి ఇద్దరూ వర్కవుట్స్ చేస్తుంటారు.
Guppedantha Manasu 6 Dec Today Episode : వసుధార యూనివర్సిటీ టాపర్ అయినందుకు అందరికీ పార్టీ ఇవ్వాలని మహీంద్రాతో చెప్పిన ఫణీంద్రా
వర్కవుట్ చేయకుండా నా మొహం చూస్తున్నావు ఏంట్రా అంటాడు రిషి. దీంతో ఏంలేదు అంటాడు. జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అంటాడు రిషి. ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం. వర్కవుట్స్ చేయి అంటాడు రిషి. మరోవైపు మహీంద్రా.. వసుధార యూనివర్సిటీ టాపర్ అయినందుకు మనం మంచి పార్టీ చేయాలి అంటాడు ఫణీంద్రా.
దీంతో ఇవ్వాలి అన్నయ్య. మినిస్టర్ గారు వనభోజనాలను రమ్మని కాల్ చేశారు. ఈ సంబరాలు అక్కడే జరుపుకుంటే బాగుంటుంది కదా అంటాడు మహీంద్రా. దీంతో ఆలోచన బాగుంది. రిషికి కూడా ఈ విషయం చెబుదాం పదా అని మినిస్టర్ గారు వనభోజనాలకు మనందరినీ రమ్మన్నారంట. మనమందరం వెళ్తున్నాం అంటాడు ఫణీంద్రా.
దీంతో సూపర్.. అంటాడు గౌతమ్. స్టూడెంట్స్ ను, స్టాఫ్ ను ఇన్వైట్ చేయాల్సిన బాధ్యత నీదే అంటాడు మహీంద్రా. ఇంట్లో వాళ్లకు ఏం కావాలో నువ్వు చూసుకో అని రిషితో అంటాడు ఫణీంద్రా. వసుధారకు వనభోజనాలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తుంది అని అనుకుంటాడు రిషి.
జగతికి ఈ విషయం చెబుతుంది వసుధార. మనం వనభోజనాలకు వెళ్తున్నాం అంటుంది వసుధార. ఇప్పుడే రిషి సార్ మెసేజ్ పెట్టారు అంటుంది. ఇంతలో అక్కడికి దేవయాని వస్తుంది. ఏంటి మనం అంటున్నావు. అసలే జగతికి ఆరోగ్యం బాగోలేదు. బయట చలి పెరిగిపోతోంది. ఇలాంటప్పుడు బయటికి తీసుకెళ్లి తిప్పడం కరెక్ట్ కాదు కదా. ఈసారికి జగతిని ఇక్కడే ఉంచి మనం వెళ్దాం అంటుంది దేవయాని.
జగతిని రాకుండా దేవయాని చేస్తుందని అనుకున్న మహీంద్రా.. జగతికి తోడుగా నేను ఉంటాను. మీరు వెళ్లండి అంటాడు మహీంద్రా. దీంతో మీరు రాకుంటే ఎలా అంటాడు గౌతమ్. కానీ.. వద్దు అంటాడు మహీంద్రా. కానీ.. వదిన గారు వన భోజనాలకు వస్తే రిషి, వసుధారను ప్రశాంతంగా ఉండనివ్వదు అంటాడు మహీంద్రా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.