Guppedantha Manasu 9 Dec Today Episode : వసుధార బాధను రిషి అర్థం చేసుకుంటాడా? ఉన్నపళంగా వసుధార తన ఊరికి ఎందుకు వెళ్లిపోయింది?
Guppedantha Manasu 9 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 డిసెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 629 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గౌతమ్ చెప్పడంతో తప్పక వెళ్లి వసుధారకు ఇద్దరు లెక్చరర్లు సారీ చెబుతాడు. ఏదో గౌతమ్ చెప్పమన్నాడని నేను చెప్పా కానీ.. లేకపోతే ఆమెకు ఎవరు చెబుతారు సారీ అని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతలో మినిస్టర్ రావడంతో అతడిని రిసీవ్ చేసుకుంటాడు రిషి. ఇంతలో వసుధారను తీసుకొని ధరణి మినిస్టర్ దగ్గరికి వస్తుంది. ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి అని అడుగుతాడు మినిస్టర్. అసలు ఆటాపాటలన్నీ ఎలా జరుగుతున్నాయి అని అడుగుతాడు మినిస్టర్. ఆటపాటలన్నీ నువ్వు ముందుండి చూసుకుంటావు కదా.. ఏమైంది వసుధార అని అడుగుతాడు మినిస్టర్.
అయినా కూడా వసుధార ఏం మాట్లాడదు. దీంతో సరే.. మీరు అవన్నీ చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి మినిస్టర్ వెళ్తాడు. ఆ తర్వాత నిజమే వసుధార.. మనం ఆటాపాటలు ప్రారంభిద్దాం అంటుంది ధరణి. దీంతో అవును రిషి.. అవే బెస్ట్ అంటాడు. అయినా కూడా వసుధార మాత్రం వినదు. ఇంకా డల్ గానే కనిపించడంతో తప్పని పరిస్థితుల్లో గౌతమ్ వెళ్లి తనను సముదాయిస్తాడు. దీంతో ఆటలపోటీల్లో పాల్గొనడం స్టార్ట్ చేస్తుంది వసుధార. అందరూ కలిసి సరదాగా తాడు లాగే ఆట ఆడుతుంటారు.
ఒకవైపు మగాళ్లు, మరోవైపు ఆడ వాళ్లు తాడును లాగుతుంటారు. రిషి గట్టిగా తాడును లాగడంతో వసుధార వెళ్లి రిషి ఒడిలో పడుతుంది. దీంతో మగవాళ్లే గెలుస్తారు. ఇద్దరూ ఒకరి ఒడిలో మరొకరు అలాగే చూస్తూ ఉండిపోతారు.
ఒకరి కళ్లలోకి మరొకరు కళ్లు పెట్టి అలాగే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అందరూ చప్పట్లు కొట్టడంతో ఇద్దరూ దూరం వెళ్తారు. ఇలా బలాబలాలు చూసుకునే ఆటలో ఎలాగూ మగాళ్లే గెలుస్తారు అంటుంది ధరణి.
Guppedantha Manasu 9 Dec Today Episode : తినకుండా అలాగే మూడీగా కూర్చొని ఉన్న వసుధార
దీంతో మేము చెప్పే ఆట ఆడండి అంటుంది పుష్ప. వద్దు అని వసుధార అన్నా కూడా వినదు. ఇంతలో మినిస్టర్ పీఏ వచ్చి భోజనాలు రెడీ అయ్యాయి అంటాడు. దీంతో భోజనాలు చేసేందుకు అందరూ కూర్చొంటారు.
నేను మిమ్మల్ని వన భోజనాలకు ఆహ్వానిస్తే మీ టీమ్ మొత్తం సగం పనులు చేసేసింది అని రిషితో అంటాడు మినిస్టర్. ఈ క్రెడిట్ అంతా నాది కాదు సార్.. వసుధార, గౌతమ్ టీమ్ ది అంటాడు.
ఆ తర్వాత వసుధార తినకుండా అలాగే కూర్చోవడంతో వసుధార ఏమైంది తిను అంటాడు రిషి. ఈ కర్రీ బాగుంది. వేసుకొని తిను అంటాడు రిషి. అయినా కూడా అలాగే మూడీగా ఉంటుంది వసుధార. దీంతో వసుధార.. నువ్వు అలా మూడీగా ఉండకు. తిను ప్లీజ్. రిషి గాడికి అనుమానం వస్తుంది అంటాడు గౌతమ్.
అయినా వసుధార ప్రవర్తన ఏదో తేడాగా ఉన్నట్టు రిషికి అర్థం అవుతుంది. ఏమైంది అని అడుగుతాడు. దీంతో ఏం లేదుసార్. కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అంటుంది వసుధార. టాబ్లెట్ తెప్పించనా అంటే వద్దు అంటుంది వసుధార.
నువ్వు ముందు భోజనం చేయి ఆ తర్వాత నీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తా అంటాడు. ఊయల కట్టి ఆ ఊయలలో కూర్చో అంటాడు రిషి. దీంతో పర్లేదు సార్ అంటుంది వసుధార. నీ మనసులో ఏదో వచ్చి చేరింది. ఎందుకో డిస్టర్బ్ అవుతున్నావు. అది నాకు అర్థం అవుతోంది అంటాడు రిషి.
దీంతో అదేం లేదు సార్ అంటుంది వసుధార. దీంతో ప్రతి రోజు ఒకేలా ఉండదు. వాటిని జయించాలి కానీ.. ఇలా మూడ్ ఆఫ్ అయితే ఎలా. మీ వాళ్లు, మీ ఊరు గుర్తొచ్చిందా అని అడుగుతాడు. దీంతో అలా ఏం లేదు సార్ అంటుంది వసుధార.
కట్ చేస్తే ఇంటికి వచ్చి జగతితో మాట్లాడుతుంది వసుధార. మనుషులు ఎందుకు మేడమ్ ఇలా మాట్లాడుతారు అని అడుగుతుంది వసుధార. కొందరి బుద్ధి అంతే.. వాళ్లను పట్టించుకోవద్దు అని చెబుతుంది జగతి. బాధపడటం కరెక్ట్ కాదు వసు అంటుంది.
ప్రతి దాన్ని భూతద్దంలో చూస్తూ గుండెను కోసేసినట్టుగా మాట్లాడుతారు. వాళ్లకు నాతో శతృత్వం ఏంటి మేడమ్ అంటుంది. దీంతో ఇలాంటి వాళ్లకు అవకాశం దొరికితే చాలు. శతృత్వం ఏం ఉండదు అంటుంది జగతి.
నువ్వు కొన్నిరోజులు మీ ఇంటికి వెళ్లు. ఇంకా ఆలస్యం చేయకు అని అంటుంది జగతి. నేను ఎందుకు మీ ఇంటికి వెళ్లమంటున్నానో నాకు స్పష్టత ఉంది.. అని చెబుతుంది జగతి. దీంతో వసుధార ఏం చేస్తుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.