Guppedantha Manasu Jagati : ‘ గుప్పెడంత మనసు ‘ సీరియల్ జగతి లేటెస్ట్ వీడియో .. వైరల్

Authored By aruna | The Telugu News | Updated on : 20 August 2023, 11:00 am

Guppedantha Manasu Jagati : బుల్లితెర నటి జ్యోతి రాయ్ అంటే గుర్తుపట్టరు కానీ గుప్పెడంత మనసు జగతి అంటే టక్కున గుర్తుపట్టేస్తారు మన తెలుగు గుప్పెడంత మనసు ఆడియన్స్. ఈ సీరియల్ ద్వారా జగతి ఎంతో పాపులర్ అయింది. ప్రస్తుతం సీరియల్స్ కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది. పలు సినిమాలలో కూడా నటిస్తూ వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే జ్యోతి రాయ్ సీరియల్స్ లలో ఎంతో హుందాగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా తన సింపుల్ లుక్ తో అందరిని ఫిదా చేస్తారు. ఆమె నటనకే కాకుండా ఆమె కట్టు బొట్టుకు కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. సీరియస్లలో అంత ట్రెడిషనల్ గా కనిపించే జ్యోతి బయట చాలా మోడరన్ గా ఉంటారు.

ఇక జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తన ప్రాజెక్ట్ అప్డేట్స్, డైలీ లైఫ్ ఎంజాయ్ మూమెంట్స్, మోడ్రన్ లుక్ ఫోటోషూట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా జ్యోతి రాయ్ షేర్ చేసిన వీడియో ఆమె అభిమానులకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. మోడ్రన్ లుక్ తో చిన్నపిల్లలా ఆడుకుంటూ అందరినీ ఫిదా చేస్తున్నారు జ్యోతి రాయ్. బ్యూటిఫుల్ వీడియోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో జ్యోతిరాయ్ షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Guppedantha Manasu Serial Jagati viral video

Guppedantha Manasu Serial Jagati viral video

 

పొట్టి బట్టలలో జ్యోతిరాయ్ చిన్న పిల్లలా కనిపిస్తుంది అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. మరి కొందరు సీరియల్లో కంటే బయటే చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి గుప్పెడంత మనసు సీరియల్ నటి జగతి తన లేటెస్ట్ వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఇకపోతే గుప్పెడంత మనసు సీరియల్ కు బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కు చాలామంది అభిమానులు ఉన్నారు. అలాగే ఈ సీరియల్ లో నటించే నటీనటులకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈ సీరియల్ లో రిషి, వసుధారలకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అలాగే జగతి పాత్రలో నటించిన జ్యోతి రాయ్ కి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు.

https://youtu.be/lHaI_rsuY4E

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp