Gurram Paapi Reddy : ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న గుర్రం పాపిరెడ్డి టీజర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gurram Paapi Reddy : ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న గుర్రం పాపిరెడ్డి టీజర్..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2025,11:38 pm

ప్రధానాంశాలు:

  •  సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీగా "గుర్రం పాపిరెడ్డి" ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం

  •  Gurram Paapi Reddy : ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న గుర్రం పాపిరెడ్డి టీజర్..!

Gurram Paapi Reddy  : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగిబాబుతో పాటు మూవీ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగాప్రొడ్యూసర్ జయకాంత్ మాట్లాడుతూ – ఈ రోజు మా “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. తెలుగులో వస్తున్న డిఫెరంట్ డార్క్ కామెడీ చిత్రమిది. సినిమా మొత్తం జాయ్ రైడ్ లా ఉంటుంది. నేను మురళీ ఈ మూవీని స్టార్ట్ చేశాం. బడ్జెట్ కొంచెం ఎక్కువైంది. అప్పుడు వేణు, అమర్ ముందుకొచ్చి మనం ఎంత బడ్జెట్ అయినా చేద్దాం అని సపోర్ట్ చేశారు. సంధ్యక్క లేకపోతే ఈ మూవీ కంప్లీట్ అయ్యేది కాదు. మా సినిమాకు యోగి బాబు గారు సహా మంచి కాస్ట్ అండ్ క్రూ దొరికారు. “గుర్రం పాపిరెడ్డి” సినిమాను మీరంతా సూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

Gurram Paapi Reddy ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న గుర్రం పాపిరెడ్డి టీజర్

Gurram Paapi Reddy : ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న గుర్రం పాపిరెడ్డి టీజర్..!

ప్రొడ్యూసర్ అమర్ బురా మాట్లాడుతూ – మేము ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాం. వేణుకు నాకు సినిమా మేకింగ్ మీద ప్యాషన్ ఉండేది. మన డ్రీమ్ ను ఎందుకు ఫుల్ ఫిల్ చేసుకోకూడదు అని ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యాం. సినిమా బాగా వచ్చింది. నరేష్ అగస్త్యకు “గుర్రం పాపిరెడ్డి” సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుంది. కామెడీ మూవీని బ్రహ్మానందం గారు, యోగి బాబు గారు లేకుండా ఊహించలేం. వారిద్దరు మా సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. అలాగే చిట్టిగా మనకు చాలా దగ్గరైన ఫరియా మా మూవీతో మరింత మంచి పేరు తెచ్చుకుంటుంది. మా డైరెక్టర్ మురళీ మనోహర్ ప్రతిభావంతుడు. సిల్వర్ స్క్రీన్ మీద “గుర్రం పాపిరెడ్డి”తో త్వరలోనే ఒక మ్యాజిక్ చూస్తారు. అన్నారు.మూవీ ప్రెజెంటర్ డా.సంధ్య గోలీ మాట్లాడుతూ – ఒక కొత్త తరహా పాయింట్ తో “గుర్రం పాపిరెడ్డి” సినిమాను నిర్మించాం. యూనిక్ డార్క్ కామెడీ మూవీగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ టీమ్ తో ట్రావెల్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. బ్రహ్మానందం, యోగిబాబు వంటి లెజెండ్స్ తో వర్క్ చేశాం. “గుర్రం పాపిరెడ్డి” సినిమాను మీరంతా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

Gurram Paapi Reddy : టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా నాకొక స్పెషల్ మూవీ అని చెప్పగలను. ఎందుకంటే యంగ్ స్టర్స్ అంతా కలిసి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో జడ్జి పాత్రలో నటించాను. దర్శకుడు మురళీ మనోహర్ సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాడు. నన్ను ఈ మూవీలో డిఫరెంట్ గా చూపించాడు. ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్ వీళ్లతో పాటు నేను మిమ్మల్ని నవ్వించేందుకు ప్రయత్నించాను. అలాగే యోగిబాబు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. ఇవాళ తమిళ చిత్ర పరిశ్రమలో యోగిబాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనకు తెలుసు. ఇటీవల యోగిబాబు హీరోగా నటించిన ఓ కన్నడ చిత్రంలో నేను నటించాను. ఆయన బయట చాలా కామ్ గా ఉంటారు. ఈయన కామెడీ చేస్తారని అనుకోం. కానీ కామెడీని పండించడంలో దిట్ట యోగిబాబు. ఇలా వీళ్లందరితో కలిసి నటించడం మంచి ఎక్సీపీరియన్స్ ఇచ్చింది. కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి. అప్పుడే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది. ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. హీరో నరేష్, హీరోయిన్ ఫరియా సహా “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటుడు వంశీ మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా షూటింగ్ చాలా ఫన్ గా సాగింది. మేమంతా ఆ ప్రాసెస్ ను ఎంజాయ్ చేశాం. ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు లాంటి పెద్దలతో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. “గుర్రం పాపిరెడ్డి” సినిమా మీ అందరినీ థ్రిల్ చేస్తుంది. అన్నారు.నటుడు జీవన్ కుమార్ మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా గురించి నెక్ట్స్ ఈవెంట్స్ లో మాట్లాడుకుందాం. అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. ఈ సినిమాలో మంచి మ్యూజిక్ వింటారు. ఈ చిత్రంలో పార్ట్ అవడం సంతోషంగా ఉంది. “గుర్రం పాపిరెడ్డి” సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎనర్జిటిక్ గా వర్క్ చేశారు. ఈ సినిమా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.డీవోపీ అర్జున్ రాజా మాట్లాడుతూ – ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. బ్రహ్మానందం లాంటి లెజెండ్ ను నా కెమెరా ద్వారా చూపించడం గౌరవంగా భావిస్తున్నా. యోగి బాబు గారి మూవీకి గతంలో అసిస్టెంట్ కెమెరామెన్ గా వర్క్ చేశాను. ఈ చిత్రంలో ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. “గుర్రం పాపిరెడ్డి” సినిమా పెద్ద విజయం సాధించాలి. త్వరలో థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.

నటుడు ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ మురళీ మనోహర్ కు థ్యాంక్స్. ఈ చిత్రంలో యోగి బాబు, బ్రహ్మానందంతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో కామెడీ, యాక్షన్, క్రైమ్..ఇలా అన్ని ఎలిమెంట్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు. డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ఈ మూవీ అనుకున్నప్పుడు జయకాంత్ ముందుండి, వేణు, అమర్ , సంధ్య గారిని ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయి పనిచేశారు. నరేష్, ఫరియా నుంచి దాదాపు 9 మంది టాప్ ఆర్టిస్టులు ఈ మూవీకి కంప్లీట్ గా సపోర్ట్ చేశారు. వాళ్లందరి సపోర్ట్ వల్లే సినిమా అనుకున్నట్లుగా సరైన టైమ్ లో కంప్లీట్ చేశాం. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ద్వారానే కథ నెరేట్ అవుతుంది. ఆయన ద్వారానే ఈ పాత్రలన్నీ పరిచయం అవుతాయి. “గుర్రం పాపిరెడ్డి” సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగిబాబు మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా ద్వారా నేరుగా తెలుగు ఆడియెన్స్ ముందుకు రావడం హ్యాపీగా ఉంది. మా హీరో నరేష్, హీరోయిన్ ఫరియా, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సహా మా టీమ్ అందరికీ నా విశెస్ చెబుతున్నా. బ్రహ్మానందం గారితో కలిసి నటించడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. నేను చేసిన సార్ మేడమ్ సినిమాను తెలుగు ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. మీ అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఆ పాత్ర ఉంటుంది. “గుర్రం పాపిరెడ్డి” సక్సెస్ మీట్ లో తప్పకుండా తెలుగులో మాట్లాడుతా. అన్నారు.నటుడు రాజ్ కుమార్ కాసిరెడ్డి – “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ లో మీరు కాస్త ఫన్ చూశారు. మూవీ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. బ్రహ్మానందం, యోగి బాబు గారు లాంటి పెద్దలు మా గురించి మాట్లాడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్లు ఈ ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. అన్నారు.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. మేము కూడా మీతో పాటే బిగ్ స్క్రీన్ మీద టీజర్ చూశాం. తన విజన్ లో మమ్మల్ని పార్ట్ చేసిన మా డైరెక్టర్ మురళీ గారికి థ్యాంక్స్. ఈ చిత్రంలో సౌధామిని అనే పాత్రలో నటించాను. బ్రహ్మానందం, యోగి బాబు వంటి పెద్దలతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా నేను ఒప్పుకునేందుకు నరేష్ అగస్త్య ఒక రీజన్. ఇలాంటి మంచి నటుడితో మూవీ చేయాలని అనిపించేది. ఈ సినిమాలో నటించేప్పుడు ప్రొడ్యూసర్స్ మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకున్నారు. మా మదర్ ఈ చిత్రంలో చిన్న అతిథి పాత్రలో నటించింది. ఈ సినిమాకు వర్క్ చేయడం సూపర్ ఎగ్జైట్ మెంట్ ఇచ్చింది. ఇందులో ఒక సాంగ్ చేస్తున్నా, ఆ పాట స్పెషల్ గా ఉంటుంది. అన్నారు.

హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ సినిమాలో నేను హీరో అంటున్నారు గానీ నేనొక్కడినే కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. బ్రహ్మానందం, యోగి బాబు గారి లాంటి స్టార్స్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ నేను ఇప్పటిదాకా చేయలేదు. అందుకే ఈ కథ వినగానే ఒప్పుకున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంకా మాట్లాడుతాను. మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు. నటీనటులు – నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, తదితరులు.

YouTube video

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది