HANUMAN – Guntur Karam : సంక్రాంతి రేసులో హనుమాన్ VS గుంటూరు కారం… ఇద్దరు తగ్గేదేలే..!!
HANUMAN – Guntur Karam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకు స్టార్ హీరోల మధ్య విపరీతమైన పోటీ నెలకొంటుంది. హీరోలంతా తమ సినిమాలను పండుగ సమయాలలో విడుదల చేయాలని కోరుకుంటారు. ఎక్కువగా సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలే విడుదలవుతుంటాయి. కానీ ఈసారి చిన్న సినిమా అయినా ‘ హనుమాన్ ‘ కూడా సంక్రాంతికి విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదల సమస్యలపై టాలీవుడ్ నిర్మాతలు సమావేశమై చర్చలు జరిపించారు.సంక్రాంతి బరిలోకి హనుమాన్, గుంటూరు కారం, నా సామి రంగా, సైంధవ్ బరిలోకి వచ్చాయి. ఇక రవితేజ ఈగల్ కూడా రావాల్సి ఉంది కానీ ఆయన వెనక్కి తగ్గారు.
ఇక చిన్న సినిమా అయినా హనుమాన్ సినిమాను కూడా ఆపేయాలని చూశారు. కానీ హనుమాన్ టీం అందుకు ఒప్పుకోలేదు. ఇది పాన్ ఇండియా సినిమా అని, సౌత్ లో నార్త్లో విడుదల అవ్వబోతుందని, విడుదల తేదీని ఎప్పుడో ఖరారు చేసామని, ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చే అవకాశం లేదని అన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా సోషియో ఫాంటసీ ఆధారంగా తెరకెక్కుతుంది. ఒకవైపు అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం జరుగుతుండగా ఇప్పుడు ఈ సినిమాను కచ్చితంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించారు. దీంతో సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు ఉన్న హనుమాన్ సినిమా కచ్చితంగా విడుదల చేస్తామని అంటున్నారు.
మా సినిమా ముందు ఎంత పెద్ద స్టార్ వచ్చినా తట్టుకోలేరని, పాన్ వరల్డ్ స్టార్ మా సినిమాని నడిపించారని, మా అతి పెద్ద స్టార్ హనుమంతుడు అని హనుమాన్ హీరో తెలిపారు. ఇక మహేష్ బాబు గుంటూరు కారం సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నిర్మాత దిల్ రాజ్ ఎక్కువ థియేటర్స్ ని బుక్ చేసుకున్నారు. దీంతో హనుమాన్ సినిమాకి కేవలం 400 ధియేటర్స్ మాత్రమే దక్కాయట. కానీ హిందీలో 1500 థియేటర్స్ దక్కినట్లు హీరో తెలిపారు. ఇక నిర్మాత దిల్ రాజ్ గుంటూరు కారం సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కేల ప్లాన్ చేశారు. దీంతో హనుమాన్ సినిమాకి తక్కువ ధియేటర్లు దక్కాయి. దీంతో సోషల్ మీడియాలో హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం సినిమా అని వైరల్ చేస్తున్నారు.