happy birthday chiranjeevi : మెగాస్టార్ బర్త్ డే ( ఆగస్ట్ 22 ) అంటే మెగా భిమానులకి పెద్ద పండుగ రోజు. దేశ విదేశాలలో ఆయన అభిమానులు ఎక్కడెక్కడైతే ఉనారో అక్కడ ఆయన పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అలాగే నేడు కూడా ఆయన అభిమానులు సంబరాలలో మునిగితేలుతున్నారు. గత ఏడాది కరోనా కారణంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను జరుపుకునేందుకు వీలు పడలేదు. కానీ ఈ ఏడాది డబుల్ బొనాంజా అన్నట్టు అన్నయ్య బర్త్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు. ‘పునాది రాళ్ళు’ సినిమాతో ఇండస్ట్రీకొచ్చిన ఆయన, అభిమానుల గుండెల్లో ఖైదీ అయ్యారు. అలుపెరని బాటసారిగా నాటి నుంచి నేటి వరకు తన సినీ ప్రయాణం అత్యద్భుతంగా కొనసాగుతోంది.
రాజకీయాలు వేరు సినిమాలు వేరు. నన్ను మీరు ఎలా కోరుకుంటే అలా మీ వద్దకొస్తా అని హామీ ఇచ్చిన మెగాస్టార్ కరోనాతో పాటు ఇతర ప్రకృతి వైపరిత్యాలలోనూ అండగా నిలిచారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం చేస్తూ కొన్ని వేల గుండె చెప్పుడు ఆగకుండా చేస్తున్నారు. అందుకే ఆయన అంటే ప్రాణం పెట్టే అభిమానులు కోట్లలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలొచ్చినా, బయట నుంచి ఎంతమంది కొత్త హీరోలొచ్చినా ఆయన ఎప్పటికీ నిత్య నూతనుడు,
నవ యువకుడే.
పదేళ్ళ విరామం..అభిమానులందరినీ తహ తహలాడేలా చేసింది. 149 సినిమాలు పూర్తి చేసిన మెగాస్టార్, తన 150 సినిమా కోసం మాత్రం యావత్ దేశ ప్రేక్షకులు 10ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ ఒక్కటి ఎప్పుడూ.. అంటూ ఇటు అభిమానులు, అటు ఇండస్ట్రీ వర్గాల వారు ఆయనని అడగని సందర్భం అంటూ లేదు..ఒత్తిడి చేయని రోజూ లేదు. అందుకే ఇక చాలూ..అంటూ ‘ఖైదీ నంబర్ 150’ అంటూ తన 150 వ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్.. అదే దూకుడుతో వరుస సినిమాలు కమిటయి అందరినీ ఆనందంలో ముంచేశారు.
60 ఏళ్ళు దాటినా కూడా యంగ్ హీరోలకి ధీటుగా పాన్ ఇండియన్ సినిమాలకి సై అంటున్నారు. యోగాలు చేద్దాం అంటూ దర్శక, నిర్మాతలను ఉత్సాహపరుస్తున్నారు. వరుసగా నాలుగు ప్రాజెక్ట్స్ కమిటవడమే కాదు.. ఆ నాలుగు సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ పూర్తి చేసిన మెగాస్టార్..మోహన్ రాజాతో చిరు 153గా ‘గాడ్ ఫాదర్’ మొదలు పెట్టారు.
తాజాగా చిత్ర టైటిల్ అనౌన్స్ చేశారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌తో బాబీ దర్శకుడిగా తన 154వ చిత్రాన్ని చేయబోతున్నారు. అలాగే తమిళంలో సూపర్ హిట్ అయినా ‘వేదాళం’ తెలుగు రీమేక్ చిత్రాన్ని తన 155వ చిత్రంగా మెగాస్టార్ చేస్తుండగా, దీనికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇవే కాదు ఈ ఏడాది మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్‌ని కటించనున్నారు మెగాస్టార్. ( “నేడు మెగాస్టార్ బర్త్ డే ( ఆగస్ట్ 22 ) యావత్ మెగా, సినీ ప్రేక్షకులు ఆయనకి బర్త్ డే విషెస్
తెలుపుతున్నారు”).
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.