Fish Venkat : ఫిష్ వెంకట్‌ని కాపాడిన రియల్ హీరో ఇతనే.. ఆయన వల్లే ఈ రోజు…!
Fish Venkat : తన కామెడీతో ప్రతి ఒక్కరిని అలరించిన ఫిష్ వెంకట్ కు ఇటీవల ఆరోగ్యం సహకరించం లేదు. ఏమైందా అని టెస్టులు చేయించుకుంటే రెండు కిడ్నీలు పాడైపోయాయని తేలింది. దీంతో ఆయన రెగ్యులర్ గా చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఈ అనారోగ్యం కారణంగా ఆయన సరిగ్గా నిలబడలేకపోతున్నారు. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేయడం లేదు. తన వ్యాపారం చేపల అమ్మకం ద్వారా సంపాదించిన సొమ్ముతో పాటు సినిమాల ద్వారా సంపాదించినది కూడా వైద్యానికి […]
ప్రధానాంశాలు:
Fish Venkat : ఫిష్ వెంకట్‌ని కాపాడిన రియల్ హీరో ఇతనే.. ఆయన వల్లే ఈ రోజు...!
Fish Venkat : తన కామెడీతో ప్రతి ఒక్కరిని అలరించిన ఫిష్ వెంకట్ కు ఇటీవల ఆరోగ్యం సహకరించం లేదు. ఏమైందా అని టెస్టులు చేయించుకుంటే రెండు కిడ్నీలు పాడైపోయాయని తేలింది. దీంతో ఆయన రెగ్యులర్ గా చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఈ అనారోగ్యం కారణంగా ఆయన సరిగ్గా నిలబడలేకపోతున్నారు. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేయడం లేదు. తన వ్యాపారం చేపల అమ్మకం ద్వారా సంపాదించిన సొమ్ముతో పాటు సినిమాల ద్వారా సంపాదించినది కూడా వైద్యానికి ఖర్చయిపోయింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకునేంత ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో కొందరు సాయాలు చేశారు. రామ్ చరణ్, చిరంజీవి వంటి వారు కూడా తమ వంతు సాయం సాధించారు.
Fish Venkat ఈయన రియల్ హీరో….
అయితే ఫిష్ వెంకట్ కు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మగ పిల్లలకు వ్యాపారాలు కూడా పెట్టించారు. అయితే ఇప్పుడు వారు తనను పట్టించుకోవడం లేదని ఫిష్ వెంకట్ వాపోతున్నారు. అప్పుడప్పుడు వచ్చి పలకరించినా వైద్యం కోసం ఆర్థిక సాయం చేయడం లేదని అంటున్నారు. చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆయన రెమ్యూనరేషన్ లక్షల్లో ఉండేది కాదు. అందుకే ఆయన ఎక్కువగా సంపాదించుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆయన మళ్లీ తిరిగి మాములు మనిషి కావడం వెనక ఓ ప్రముఖ వ్యక్తి ఉన్నాడు. ఆయనని రియల్ హీరో అని కీర్తిస్తున్నారు.
ఫిష్ వెంకటేష్ సమస్యకు స్పందించిన పీఆర్కే హాస్పిటల్ అధినేత పుట్టా రవికుమార్ అనేక టెస్ట్‌లు చేయించి ఆయనని కంటికి రెప్పలా కాపాడారు. చాలా మంచి ట్రీట్‌మెంట్ ఆయనకి దక్కేలా చేశారు. పుట్టా రవికుమార్.. శ్రీనన్న అల్లుడు, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి తనయుడు కావడం, బ్రహ్మంగారిమఠం మండల వాసులు కావడంవిశేషం. ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నప్పుడు వెంటనే అతనిని ఆసుపత్రికి పిలిపించుకొని అన్ని రకాల పరీక్షలు చేయించి ఇప్పడు తిరిగి మాములు మనిషి కావడంలో రవి కుమార్ ఎంతో కృషి చేశారు.