HIT 2 Movie : ఓటీటీ లోకి హిట్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి బ్రేకింగ్ న్యూస్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

HIT 2 Movie : ఓటీటీ లోకి హిట్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి బ్రేకింగ్ న్యూస్…!

HIT 2 Movie : టాలీవుడ్ లో హీరో అడవి శేషుకి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అడవి శేషు హిట్ ది సెకండ్ కేస్ సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. అలాగే వరుస సినిమాలు చేస్తూ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :5 December 2022,9:00 pm

HIT 2 Movie : టాలీవుడ్ లో హీరో అడవి శేషుకి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అడవి శేషు హిట్ ది సెకండ్ కేస్ సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. అలాగే వరుస సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్న అడవి శేషు ఈ సినిమాలో హీరోగా నటించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

భారీ అంచనాల మధ్య హిట్ ది సెకండ్ కేస్ సినిమా డిసెంబర్ రెండవ తేదీన థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకి థియేటర్లో విడుదల అయిన మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుది. హిట్ ది సెకండ్ కేస్ సినిమా మొదటిరోజు భారీ రేంజ్ లో కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద లభించాయి. అలాగే ఆ తర్వాత కూడా ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా కొనసాగుతున్న

hero adivi sesh latest HIT 2 Movie update

hero adivi sesh latest HIT 2 Movie update

ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే హిట్ ది సెకండ్ కేస్ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీపీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కొన్ని వారాలు థియేటర్లో ఆడడం ముగిశాక తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా సక్సెస్ తో అడవి శేషు భారీ బడ్జెట్ సినిమాలను చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది