Murali Karthik : భార్య చెల్లిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరో.. కట్ చేస్తే కెరీర్ మొత్తం పాయే!
Murali Karthik : సినీ నటుడు మురళి కార్తీక్ ముత్తురామన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. తెలుగులో అన్వేషణ సినిమాతో ఈ హీరో అందరికీ సుపరిచితుడుగా తెలుసు. ఇక ఇతన్ని అందరూ కార్తీక్ అని పిలుస్తారు. సౌత్ యాక్టర్‌గా రాజకీయ నాయకుడిగా,నేపథ్య గాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు. కార్తీక్ ఎక్కువగా తమిళ మూవీస్‌లో మాత్రమే నటించారు. తమిళ్ సినిమా అలైగల్ ఓవాతిల్లై భారతి రాజా ఫిలిం ద్వారా కార్తీక్ పరిచయం అయ్యారు.
మురళి కార్తీక్ తెలుగులో సీతాకోకచిలుక, అన్వేషణ, మగరాయుడు వంటి సినిమాల్లో నటించారు. కార్తీక్ ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోయి నటించగలిగే మంచి ప్రతిభ కలవాడు.అందుకే ఆయన నటన సామర్థ్యాన్ని చూసి నవరస నాయగన్‌గా గుర్తింపు పొందాడు.ఇక 125కు పైగా సినిమాల్లో నటించిన ఈయన తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, అదేవిధంగా నంది అవార్డులను కూడా దక్కించుకున్నారు. ఈయన కెరీర్‌లో 4 ఫిలింఫేర్ అవార్డులు కూడా ఉన్నాయి. ఇక 1988లో రాగిణిని పెళ్ళి చేసుకున్న కార్తీక్ దంపతులకు గౌతమ్ కార్తీక్, గైన్ కార్తీక్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. 1992లో రాగిణి సోదరి రథి ని కూడా వివాహం చేసుకున్నారు.
ఇక వీరికి తిరన్ కార్తీక్ అనే కొడుకు ఉన్నాడు.భార్య చెల్లిని వివాహం చేసుకున్న అనంతరం తాగుడుకు బానిస అయిన కార్తీక్ కెరీర్‌ను పాడుచేసుకున్నాడు. ఇక 2006 లో తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందు కార్తీక్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా తమిళనాడు రాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా వర్క్ చేసారు. ఇక తర్వాత విరుదునగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా కేవలం 15000 ఓట్లు మాత్రమే వచ్చాయి. తాగుడుకు బానిస కావడం వలన అటు సినిమా కెరీర్, ఇటు రాజకీయ కెరీర్ రెండింటిని కార్తీక్ దూరం చేసుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తన బంగారం లాంటి జీవితాన్ని తానే చేతులారా పాడుచేసుకున్నాడు.