Hero Nikhil : హీరోని చేస్తా అని కోటి తీసుకున్న ప్రొడ్యూసర్ .. చివరికి దారుణ మోసం చేశాడంటూ .. అసలు నిజం బయటపెట్టిన నిఖిల్ …! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hero Nikhil : హీరోని చేస్తా అని కోటి తీసుకున్న ప్రొడ్యూసర్ .. చివరికి దారుణ మోసం చేశాడంటూ .. అసలు నిజం బయటపెట్టిన నిఖిల్ …!

 Authored By prabhas | The Telugu News | Updated on :24 December 2022,6:40 pm

Hero Nikhil : సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోగా సక్సెస్ కావడం అంతా ఈజీ కాదు. ఎంతోమంది హీరోలు కావాలని సినిమా ఫీల్డ్ కు వస్తుంటారు. అందులో కొంతమందికి మాత్రమే ఆ లక్క్ దొరుకుతుంది. ఇక హీరోగా అవకాశం వచ్చినప్పటికీ సక్సెస్ అవ్వడం చాలా కష్టం. బ్యాక్ గ్రౌండ్ లేని వారు ఇండస్ట్రీలో నెట్టుకు రావడం చాలా కష్టం. సొంతంగా తమ శక్తితో హీరోగా ఎదిగిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పవచ్చు. ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు నిఖిల్.

ఇప్పుడు 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. అయితే నిఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నాడో చెప్పుకొచ్చాడు. ఎన్నో అవమానాలను, మోసాలను ఎదుర్కొన్నాడని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా నిఖిల్ ప్రయాణం మొదలైంది. సీరియల్స్ లో కూడా నటించాడు. అక్కడే ఉంటే బుల్లితెరకే పరిమితం కావాల్సి ఉంటుందని, సినిమా ఆఫర్స్ కోసం ఆడిషన్స్ కి హాజరవుతూ ఉండేవాడట. హీరో అవ్వాలంటే 50 లక్షలు ఇవ్వాలని అన్నారట. కొందరు కోటి రూపాయలు కూడా అడిగారట.

Hero Nikhil face the problems before actor

Hero Nikhil face the problems before actor

ఎలాగైనా హీరో కావాలి అని ఆలోచనలో ఉన్న నిఖిల్ కొంతమంది మాటలను నమ్మి 5 లక్షలు ఇచ్చాడట. ఒక లక్ష ఖర్చు చేసి కొన్ని రోజులు షూటింగ్ డ్రామా ఆడారట. తర్వాత సినిమా ఆపేసారట. ఇదంతా మోసం అని అప్పుడు తెలుసొచ్చిందట. శేఖర్ కమ్ముల గారు నాలోని నటనను చూసి హ్యాపిడేస్ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారని గతంలో ఎదుర్కొన్న సంఘటనలను గుర్తు చేసుకున్నారు నిఖిల్. కార్తికేయ సినిమాకి పాన్ ఇండియా సక్సెస్ వస్తే ఇదంతా ఎలా జరిగింది నిజమేనా అని నిఖిల్ అనుకునేవాడట. తాను ఎదుర్కొన్న కష్టాలు చూసి, ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి అసలు నమ్మలేకపోతున్నాను అని పరోక్షంగా తెలిపాడు నిఖిల్.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది