Shalini Pande : ఫుల్లుగా తాగి మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తున్న‌ హీరోయిన్ .. ఫోటోలు వైరల్..!

Authored By aruna | The Telugu News | Published on: October 13, 2023, 7:15 pm

Shalini Pande : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు జోడిగా ‘ అర్జున్ రెడ్డి ‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది శాలిని పాండే. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఆ తర్వాత తమిళ్, కన్నడ, హిందీ భాషలలో సినిమాలు చేసింది. అయినా ఈ బ్యూటీ కి గుర్తింపు రావడం లేదు. ప్రస్తుతం హిందీలో ఒక సినిమాలో నటిస్తోంది. గత ఏడాది ‘ జయేష్ బాయ్ జోర్దార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగులో ‘ నిశ్శబ్దం ‘ సినిమాలో చివరిగా కనిపించింది.

సినిమాల పరంగా డల్ గా ఉన్న శాలిని పాండే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ప్రేక్షకులు అలరిస్తూ ఉంటుంది. వరుసగా పోస్ట్ లు పెడుతూ అభిమానులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడప్పుడు బోల్డ్ గా ఫోటో షూట్ చేస్తూ యూత్ ని తనవైపు కు తిప్పుకుంటుంది. తాజాగా శాలిని పాండే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా శాలిని పాండే తన స్నేహితులతో కలిసి నైట్ పార్టీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Heroin Shalini pande latest pics

Heroin Shalini pande latest pics

ఆ పార్టీలో మస్తుగా ఎంజాయ్ చేస్తూమ ఫుల్లుగా మందు తాగుతూ రచ్చ చేస్తున్న ఫోటోలు శాలినీ పాండే సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఒక ఫోటోలో శాలిని మిడిల్ ఫింగర్ చూపిస్తూ బూతు పదాన్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఓ అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపిస్తే దాని అర్థం ఏంటో అందరికీ తెలుసు. అలా శాలిని పచ్చి బూతు ఫోటో షేర్ చేసి నెటిజన్ల చేత తిట్లు తిట్టించుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి భామ బయట ఇంత బోల్డ్ గా ఉందేంటి అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగులో అవకాశాలు దక్కించుకోవడం కోసం సోషల్ మీడియా హాట్ ఫోటోలు షేర్ చేయడంతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి ఫోటోలు కూడా షేర్ చేస్తుందా అని అనుకుంటున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp