Tamannaah : తమన్నా సినీ ఇండస్ట్రీ లోకి వచ్చాక ఎన్ని వేల కోట్లు వెనకేసుకుందో తెలిస్తే నోరెళ్ళబెడతారు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tamannaah : తమన్నా సినీ ఇండస్ట్రీ లోకి వచ్చాక ఎన్ని వేల కోట్లు వెనకేసుకుందో తెలిస్తే నోరెళ్ళబెడతారు..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :4 January 2023,7:40 pm

Tamannaah : తెలుగు పరిశ్రమలోకి వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘ హ్యాపీడేస్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మిల్కీ బ్యూటీ తమన్న. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుసగా సినీ ఆఫర్లు వచ్చి పడ్డాయి. దీంతో ఎప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ప్రస్తుతం తమన్నా వయసు 33 ఏళ్ళు. అయినా ఇప్పటికే ఆమె అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఫాంటా, సెల్కాన్ వంటి బ్రాండ్స్ కి పలు శారీ షోరూంలకి కూడా బ్రాండ్ అంబాసడర్ గా చేస్తూ కోట్లు సంపాదిస్తుంది.

ప్రస్తుతం ఆమె వార్షిక ఆదాయం 12 కోట్లు ఉందట. అంటే నెలకి కోటి రూపాయలు సంపాదన. ఇప్పటివరకు ఆమె వెనకేసుకున్న ఆస్తి విలువ 110 కోట్లకు పైన ఉంటుందట. ఒక్కో సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అలాగే సినిమాలోని ఐటెం సాంగ్ కు 60 లక్షలు తీసుకుంటుందట. ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో 10 నిమిషాలు డాన్స్ వేయడానికి తమన్న 50 లక్షలు తీసుకుందట. 2015 లో తమన్నా వైట్ అండ్ గోల్డ్ పేరిట ఒక జివెల్రీ బ్రాండ్ కూడా స్థాపించింది. అంతేకాకుండా తమన్నా దగ్గర రెండు

Heroin Tamannaah have crores of property

Heroin Tamannaah have crores of property

కోట్ల విలువైన వజ్రం కూడా ఉందట. ఆ వజ్రం ఉపాసన కొణిదెల తమన్నాకి బహుమానంగా ఇచ్చిందట. అది ప్రపంచంలోనే ఐదవ పెద్ద డైమండ్ అని టాక్. అలాగే తమన్నాకి ముంబైలో వెర్సోవాలో రూ 16 కోట్లు విలువ చేసే లగ్జరీ ఫ్లాట్, లాండ్ రోవర్ డిస్కవరీ, బీఎండబల్యూ 5 సిరీస్, బెంజ్ కార్లు ఉన్నాయట. అలాగే తమన్నా వాడే చానల్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ ఖరీదే రూ 3 లక్షలు ఉంటుందట. సినీ ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ హీరోయిన్ ఇంతలా సంపాదించలేదు. స్టార్ హీరోలకి కూడా అన్ని ఆస్తులు కూడా ఉన్నాయో లేవో కానీ తమన్నాకి మాత్రం ఆస్తులు బాగానే ఉన్నాయి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి