Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మకు పబ్లిక్‌గా ఆ హీరోయిన్ అలా ముద్దు పెట్టేసిందేంటి…!
Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేష్టలు అంత ఈజీగా ఎవరికి అర్ధం కావు. ఆయన సినిమాలు, ట్వీట్స్ కొంత సంచలనాలు సృష్టిస్తుంటాయి. తాజాగా ఆయన డేంజరస్ అనే సినిమా చేయగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయాలని అనుకున్నాడు. కాని పలు కారణాల వలన సినిమా వాయిదా పడింది. ఈ మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్స్‌లో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద హీరోలతో, పెద్ద బడ్జెట్‌తో సినిమాలు చేసే ఓపిక, సామర్థ్యం, తపన తనకు లేవని కుండబద్దలు కొట్టారు. తనను ఆసక్తికి గురిచేసే అంశంతోనే సినిమా తీస్తానని, దానిని ఎంతమంది చూశారు? ఎంత బాగుంది?
అన్న దాని కంటే ఎంతలో తీశాననే విషయాన్ని మాత్రమే ఆలోచిస్తానని అన్నారు వర్మ.ఇద్దరు అమ్మాయిలు స్వలింగ సంపర్కులు ఎందుకయ్యారన్న చర్చ లేకుండా వారి చుట్టూ ఓ క్రైమ్ డ్రామాను అల్లుతూ ‘మా ఇష్టం’ సినిమాను చేశారు వర్మ. ఇందులో యాక్షన్ అంశాలు ఎక్కువగా ఉంటాయని, ఇద్దరమ్మాయిల మధ్య ఓ రొమాంటిక్ డ్యూయెట్‌ను కూడా చిత్రీకరించానని, ఇలా తీయడం ప్రపంచంలోనే ఇది తొలి ప్రయత్నమని వర్మ వివరించారు. ఆయన రూపొందించిన ‘కొండా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించిన మరో సినిమా జూన్‌లో విడుదల కానుంది.

heroine comments on Ram Gopal Varma
Ram Gopal Varma : మాములోడువి కాదయ్యా..
‘దహనం’ అనే వెబ్ సిరీస్ పూర్తి కాగా, మరికొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.రామ్ గోపాల్ వర్మ గురువారం (ఏప్రిల్ 7) పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీలో పలువురితో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాడు వర్మ.. ఈ క్రమంలో టాలీవుడ్ హాట్ హీరోయిన్ నైనా గంగూలీ వర్మకి ముద్దుపెట్టింది. ఓ చేతిలో గ్లాస్, మరో చేతితో నైనాని పట్టుకొని ఉన్నాడు వర్మ.. ఈ క్రమంలో నైనా గంగూలీ హ్యాపీ బర్త్‌డే అంటూ అతడి బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ వీడియోను స్వయంగా ఆ హీరోయినే తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ వర్మని పొగొడుతూ తెగ ట్వీట్ లు చేస్తున్నారు.
View this post on Instagram