Meera Jasmine : ఆ ప‌ని చేయ‌లేక‌నే మీరా జాస్మిన్ స్టార్ హీరోయిన్ కాలేక‌పోయిందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Meera Jasmine : ఆ ప‌ని చేయ‌లేక‌నే మీరా జాస్మిన్ స్టార్ హీరోయిన్ కాలేక‌పోయిందా..?

 Authored By prabhas | The Telugu News | Updated on :31 July 2022,1:00 pm

Meera Jasmine : మీరా జాస్మిన్ ఒకప్పుడు తెలుగు చిత్ర సీమలో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ తో సినిమాలు చేసినప్పటికీ ఆమెకు స్టార్డం హోదా రాలేదు. కేరళకు చెందిన మీరా జాస్మిన్ తన సహజమైన నటనతో జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. తెలుగులో అమ్మాయి బాగుంది సినిమా తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రవితేజతో కలిసి భద్ర లో నటించింది. ఆ తర్వాత గుడుంబా శంకర్, రారాజు, మహారధి వంటి వరుస ఆఫర్లు వచ్చినా కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. పెద్ద హీరోలతో నటించే అవకాశం దక్కినా మీరా జాస్మిన్ స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకోలేక పోయింది.

దీనికి కారణం అవసరమైన సమయంలో మీరా జాస్మిన్ స్కిన్ షో చేయకపోవడమే అంటున్నారు నెటిజన్లు. సావిత్రి మాదిరిగానే అచ్చ తెలుగు హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలి అనుకుంది మీరాజాస్మిన్. ఫలితంగా ఎక్స్ పోజింగ్ కి పెద్దగా ఆసక్తి చూపలేదు. సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్ కు సంబంధించినది కావడంతో హీరోలతో రొమాన్స్ చేస్తేనే సినిమా అవకాశాలు దక్కుతాయి. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రవితేజ, శివాజీ లాంటి హీరోలతో సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాల్లో గ్లామర్ రోల్ లేకపోవడం.

Heroine Meera Jasmine fade out just by showing them

Heroine Meera Jasmine fade out just by showing them

Meera Jasmine : తాజాగా స్కిన్ షో చేసిన మీరా జాస్మిన్ :

ఆమెకు మైనస్ గా మారింది రాజశేఖర్ తో నటించిన పుట్టింటికి రా చెల్లి సినిమా లో కూడా ఆమె చెల్లెలి పాత్ర చేసింది. తాజాగా పూర్తి గ్లామర్, స్కిన్ షోతో ఫోటోషూట్స్ చేస్తోంది మీరాజాస్మిన్. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ మాదిరిగానే మీరా జాస్మిన్ అటు మేకర్స్ ని, ఇటు ఆడియన్స్ ని రెచ్చగొట్టేలా స్కిన్ షో చేస్తుంది. ఇప్పుడు ఎంత రెచ్చగొట్టినా ఏం లాభం రష్మిక, పూజా హెగ్డే ముందు వరుసలో ఉన్నారు. మీరా జాస్మిన్ ఈ పని అప్పట్లోనే చేసి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం కూడా ఆమె కెరీర్ కు మైనస్ గా మారింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది