Pooja Hegde : పూజా హెగ్డే యాక్టింగ్ కెరీర్ మటాష్ ?? చేసిన పిచ్చి పని వల్లనే ?
Pooja Hegde : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది దర్శకులకు మరియు నిర్మాతలకు పూజా హెగ్డే లక్కీ హీరోయిన్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమాలలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న SSMB 28, పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్”…లో నటిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ తో ఇటీవల “కిసి కా భాయ్ కిసీ కా జాన్” అనే సినిమా చేయడం జరిగింది.
కానీ కెరియర్ ప్రారంభంలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న పూజ హెగ్డే ప్రజెంట్ వరుస ప్లాపులతో సతమతం అవుతుంది. దీనికి ప్రధాన కారణం పూజ తల పొగరు బాగా పెరిగిపోవడమే ఆమె కెరీర్ కాస్త డౌన్ అవ్వడానికి ప్రధాన కారణమంటున్నారు. రెమ్యునరేషన్ లు అడ్డగోలుగా పెంచేయడం… షూటింగ్‌కు టైంకు రాకపోవడం.. హీరోలతో సెట్ లో గొడవలు. ఇవే ఆమెకు రివర్స్ తీసుకొచ్చాయని చెప్పుకొస్తున్నారు. దీంతో కెరీర్ స్టార్టింగ్ లో వరుస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న పూజా హెగ్డే తాజాగా బ్యాక్ టు బ్యాక్ ఐదు అట్టర్ ఫ్లాప్ లు అందుకోవటం జరిగిందట.
రాధేశ్యం, ఆచార్య, కోలీవుడ్ లో జీవాతో చేసిన మాస్క్, విజయ్ తో చేసిన బీస్ట్.. ఇక రీసెంట్ గా సల్మాన్ మూవీతో మొత్తం ఐదొ అట్టర్ ప్లాప్ పూజా హెగ్డే ఖాతాలో పడ్డింది. దీంతో గోల్డెన్ లెగ్ పేరు కాస్త ఇప్పుడు ఐరన్ లెగ్ గా మారింది. దీనంతటికీ ప్రధాన కారణం సమయానికి సినిమా సెట్స్ కి రాకపోవటంతో పాటు ప్రతి సినిమా సెట్స్ కి పదుల సంఖ్యలో తన టీంకి అనవసరమైన ఖర్చు… నిర్మాతల చేత చేయించడం అని టాక్. ఈ పరిణామంతో ఇప్పుడు పూజ హెగ్డే కెరియర్ మటాష్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.