Heroine : మొగుడు ఉండగానే రెండో పెళ్లి చేసుకోకుండా బిడ్డకి జన్మనిచ్చిన టాప్ హీరోయిన్ – టాప్ సీక్రెట్ బయటపడింది !

 Authored By prabhas | The Telugu News | Updated on :2 November 2022,8:40 pm

Heroine : మలయాళ హీరోయిన్ రేవతి అసలు పేరు ఆశ కేలుని నాయర్. ఈమె తండ్రి ఆర్మీ ఆఫీసర్ కాగా ఆమె చిన్నతనం నుంచే భరతనాట్యం నేర్చుకుంది. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ఫోటోలు అప్పట్లో తమిళ్ మ్యాగజిన్ ముఖ చిత్రంపై రావడంతో అవి చూసిన డైరక్టర్ భారతి రాజా తను తీయబోయే సినిమా మన్ వాసవై సినిమాలో హీరోయిన్గా తీసుకున్నాడు. తెలుగులో రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన మానసవీణ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ లో కూడా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. రేవతి తమిళంలోనే ఎక్కువగా నటించింది. ఆమె సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలో పట్టు సాధించి దర్శకురాలిగా కూడా మారింది. ఇక వేరే విభాగాల్లో నేషనల్ అవార్డు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకుంది.

ఆమె సినిమాలో నటిస్తున్న సమయంలో మలయాళ దర్శకుడు సురేష్ చంద్ర మీనన్ తో ప్రేమలో పడింది. పుతియ ముఖమ్ అనే సినిమాలో సురేష్ రేవతి కలిసి నటించారు. ఆ సినిమాకి అతడే డైరెక్టర్. 1986లో వీరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత కూడా రేవతి సినిమాలు చేసింది. అయితే రేవతి సినిమాలో నటించాలని ఉద్దేశంతో సురేష్ మొదట్లో పిల్లలను కనకూడదు అని కండిషన్ పెట్టాడు. కెరీర్ ముగిసాక పిల్లలు కావాలనుకున్న వారికి సంతానం కలగలేదు. ఈ విషయంలో ఇద్దరికీ భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. రేవతి మాత్రం సినిమా ఇండస్ట్రీలో బిజీగా గడిపింది. అలాగే తల్లి కావాలని కూడా నిర్ణయించుకుంది.

Heroine Revathi give birth to a child without remarrying

Heroine Revathi give birth to a child without remarrying

రేవతి తన 48వ పుట్టినరోజు నాడు తాను ఒక బిడ్డకు తల్లి అయ్యాను అంటూ ప్రకటించింది. అయితే అందరూ ఈ వయసులో మరో పెళ్లి చేసుకోకుండా మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా ఎలా తల్లీ అయిందని అనుమానం వ్యక్తం చేశారు. అందరూ నటి శోభన లాగా ఒక పాపను దత్తత తీసుకుంది అని అనుకున్నారు. కాని తన కూతురికి తాను సొంత తల్లి ప్రకటించింది. దాంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనే మాట ఎక్కువగా వినిపించింది. అయితే రేవతి ఐవిఎఫ్ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లుగా తెలిసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు తల్లి కావాలని రేవతి ఆశయం ముందు ఆమె తండ్రి ఎవరు అన్న ప్రశ్న చిన్న పోయింది. ఆ విధంగా రేవతి మహి అనే బిడ్డకు జన్మనిచ్చింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి