Trisha Krishnan : హీరోయిన్ త్రిషనే కావాలన్నా స్టార్ ప్రొడ్యూసర్.. వరుసగా ఆమెతోనే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trisha Krishnan : హీరోయిన్ త్రిషనే కావాలన్నా స్టార్ ప్రొడ్యూసర్.. వరుసగా ఆమెతోనే..?

 Authored By mallesh | The Telugu News | Updated on :13 October 2022,9:00 pm

Trisha Krishnan : హీరోయిన్ త్రిష ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నది. కానీ ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టింది మాత్రం తెలుగు సినిమాలే. గతంలో త్రిష చూసేందుకు బక్క పలుచగా, బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో కనిపించేది. ఈ అమ్మడుని ఇండస్ట్రీలో చాలా మంది నల్లగా ఉంటుందని ఎగతాళి చేసేవారని తెలిసింది. తెలుగులో నీ మనసు నాకు తెలుసు మూవీతో త్రిష టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. త్రిష లవర్ బాయ్ తరుణ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వగా.. అది ఆశించినంత పేరు తెచ్చుకోలేదు.

ఇక అదే టైంలో దర్శకుడు ఎంఎస్ రాజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం కొత్త హీరోయిన్‌ను వెతుకుతున్నారు. ఆ టైంలోనే త్రిషను చూసి ఫైనల్ చేశారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అప్పటికే మనసంతా నువ్వే, నీ స్నేహం, ఒక్కడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు ఎంఎస్ రాజు. త్రిషను పెట్టిన తీసిన వర్షం సూపర్ హిట్ అవ్వడంతో ఆమెతోనే మరో రెండు సినిమాలు ప్లాన్ చేశాడు.ఇదే విషయంపై త్రిష దగ్గరకు వెళ్లి డేట్స్ అడుగగా ఆమె మీకు ఎన్ని కావాలన్నా ఇస్తానని చెప్పిందట..

Heroine Trishane Kavalanna is star producer

Heroine Trishane Kavalanna is star producer

Trisha Krishnan : స్టార్ ప్రొడ్యూసర్‌ను ఎలా మెప్పించిదంటే..

దీంతో త్రిష కోపరేషన్ నచ్చి నిర్మాత ఆమె మీద మనసు పారేసుకున్నారని టాక్ వచ్చింది. అందుకే తన తర్వాతి ప్రాజెక్టుల్లో త్రిషనే ఎక్కువగా కనిపించేది. వర్షం సినిమా తర్వాత సిద్దార్థ్ హీరోగా నువ్వొస్తానంటే నేనొద్దంటనా మూవీ చేసి మరో హిట్ కొట్టిన ఎంఎస్ రాజు.. ప్రభాస్ హీరోగా పౌర్ణమి సినిమా చేశాడు.ఇందులో చార్మితో పాటు మరోసారి త్రిషను హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. ఈ సినిమా స్టోరీ బాలేదని పలువురు చెప్పిన వినలేదట నిర్మాత.. అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఎంఎస్ రాజుకు సక్సెస్ రేటు తగ్గిపోయింది. ప్రస్తుతం మళ్లీ నిర్మాతగా రాణించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు ఎంఎస్ రాజు.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది