Allu Arjun : అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్.. హైకోర్టులో ఊరట.. తప్పిన జైలు శిక్ష..!
ప్రధానాంశాలు:
Allu Arjun : అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్.. హైకోర్టులో ఊరట.. తప్పిన జైలు శిక్ష..!
Allu Arjun : అల్లు అర్జున్ కి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. నాంపల్లి కోర్టులో 14 రోజూ రిమాండ్ అంటూ తీర్పు రాగా హై కోర్టులో క్వాష్ పిటీషన్ వేసిన అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఫైనల్ గా అతనికి మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. పుష్ప 2 ప్రీమియర్స్ టైం లో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆ థియేటర్ కు అల్లు అర్జున్ ఎలాంటి ముందస్తు సెక్యురిటీ పర్మిషన్స్ లేకుండా వళ్లాడని ఆ ఘటనకు అల్లు అర్జున్ కూడా ఒక కారణమని పోలీసులు అల్లు అర్జున్ ని కస్టడీలో తీసుకున్నారు.
ఐతే నాంపల్లి కోర్టు ఈ విషయంపై వాదనలు వినిపించి అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. ఐతే హైకోర్టులో అంతకుముందే క్వాష్ పిటీషన్ వేసిన అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి ఆయన గురించి వాదనలు వినిపించారు. ఐతే వాదోవపాదాలు విన్న తర్వాత అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్ట్. దీనితో చంచల్ గూడ జైలుకి వెళ్తాడని అనుకున్న అల్లు అర్జున్ కాస్త ఇంటికి వెళ్లబోతున్నాడు.
Allu Arjun హైకోర్టులో క్వాష్ పిటీషన్ లో..
మధ్యాహ్నం 12 గంటల నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. నాంపల్లి కోర్ట్ తీర్పుతో అల్లు అర్జున్ కి చంచల్ గూడ జైలులో 14 రోజుల రిమాండ్ కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ తరపున లాయర్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ లో తన వాదన వినిపించి ఫైనల్ గా బెయిల్ తీసుకొచ్చారు.
సినిమా రిలీజ్ టైంలో అభిమానుల మధ్య స్టార్స్ సినిమా చూడాలని అనుకుంటారు. కానీ దానికి ముందస్తు పర్మిషన్స్ ఇంకా సరైన సెక్యురిటీ విధానం ఎర్పాటు చేస్తారు. కానీ పుష్ప 2 విషయంలో అది లోపించడం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఐతే ఈ విషయంపై సీరియస్ గా ఉన్న పోలీసులు అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ మేనేజర్, సెక్యురిటీ ఇంచార్జ్ లను అరెస్ట్ చేశారు. ఐతే అల్లు అర్జున్ కి హైకోర్ట్ బెయిల్ ఇవ్వడం అందరిని హమ్మయ్య అనుకునేలా చేసింది. Allu Arjun, High court, Bail, Pushpa 2, Police Department