Karthika Deepam : హిమకు ప్రామిస్ చేయడంతో జ్వాలను నిరుపమ్ పెళ్లి చేసుకుంటాడా? జ్వాలే శౌర్య అని శోభకు తెలుస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam : హిమకు ప్రామిస్ చేయడంతో జ్వాలను నిరుపమ్ పెళ్లి చేసుకుంటాడా? జ్వాలే శౌర్య అని శోభకు తెలుస్తుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :12 June 2022,10:48 am

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 13 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 1376 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బావ.. నువ్వు రిపోర్ట్స్ ను చించేస్తున్నావు. దేవుడేమో నా ఆయుష్షును క్యాలెంటర్ లో చించేస్తున్నాడు. చూడు.. ఇవి నా లేటెస్ట్ రిపోర్ట్స్ అని నిరుపమ్ కు చూపిస్తుంది హిమ. ఆ రిపోర్ట్స్ చూసి నిరుపమ్ షాక్ అవుతాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు బావ.. ఇవన్నీ చూసి కూడా నా మీద ప్రేమను పెంచుకుంటున్నావు అని అడుగుతుంది హిమ. దీంతో పెంచుకోవడం ఏంటి.. నీ మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు అంటాడు నిరుపమ్. వీళ్లిద్దరూ అక్కడ ఉన్న విషయం శాంతాబాయి.. శోభకు చెప్పడంతో.. వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి అక్కడికి శోభ వెళ్తుంది.

hima pleads nirupam to marry jwala in karthika deepam

hima pleads nirupam to marry jwala in karthika deepam

కొన్ని రోజుల తర్వాత నేను ఉండను. నా మాట విని నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకో అని నిరుపమ్ ను కోరుతుంది హిమ. దీంతో శోభతో పాటు నిరుపమ్ కూడా షాక్ అవుతాడు. నా ప్రేమను ఆమె రూపంలో అందిస్తాను అంటుంది హిమ. నేను చెప్పిన అమ్మాయిని చేసుకోవాల్సిందే అంటుంది. దీంతో ఎవరా అమ్మాయి అని అడుగుతాడు నిరుపమ్. దీంతో జ్వాల అని పేరు చెబుతుంది. నాకు నువ్వు ప్రామిస్ చేస్తున్నావు అని చెప్పి జ్వాలను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని చెబుతుంది హిమ. దీంతో నిరుపమ్ షాక్ అవుతాడు.

Karthika Deepam : హిమకు క్యాన్సర్ అని తెలిసి భావోద్వేగం చెందిన ఆనంద రావు

దీప కార్తీక్ సంతోషంగా ఉన్నది కొన్ని రోజులే. ఉన్నన్నాళ్లు కలిసి బతకలేకపోయారు కానీ.. చావు వాళ్లిద్దరినీ కలిపింది. ఎన్ని రోజులు అయినా మన ఇంట్లో ఈ కష్టాలు తీరడం లేదు అని ఆనంద రావు, సౌందర్య ఇద్దరూ కార్తీక్, దీప ఫోటోను చూసి మాట్లాడుతారు.

ఏ జన్మలో చేసుకున్న పాపమో మమ్మల్ని ఇంకా వెంటాడుతోంది అని అంటుంది సౌందర్య. మరోవైపు శోభ.. స్వప్పను కలవడానికి తన ఇంటికి వెళ్తుంది. హిమ, జ్వాల ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుకుంటుంది. హిమకు నిరుపమ్ అంటే ఇష్టం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. తనకు క్యాన్సర్ ఉందని ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుంది కానీ.. తన బావను ఆ ఆటో దానికి కట్టబెట్టడమే నాట్ ఓకే అని అనుకుంటుంది శోభ.

స్వప్న.. శౌర్య గురించి చెబుతుంది శోభకు. హిమకు సోదరి ఉందని.. తను చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెబుతుంది. దీంతో ఆ జ్వాలే శౌర్యనా అని అనుమానపడుతుంది. మరోవైపు జ్వాలను పిలిచి తనకు గుడ్ న్యూస్ చెబుతుంది హిమ.

నీ డాక్టర్ బాబుకు నువ్వు ఇక ఐలవ్యూ చెప్పొచ్చు అని అంటుంది హిమ. రాత్రి పూట నిరుపమ్ బావను తీసుకొచ్చా. అతడిని కలువు అని చెబుతుంది. అప్పుడు ఐలవ్యూ చెప్పు అంటుంది. దీంతో సరే అంటుంది జ్వాల. రాత్రి కాగానే.. జ్వాల వస్తుంది. నిరుపమ్ కు ఐలవ్యూ చెప్పేందుకు జ్వాల వస్తుండగా.. తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ రాగానే కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల.

తెల్లారి.. నా ప్లాన్ అంతా వేస్ట్ చేశావు. ఏమైంది. ఎందుకు నిరుపమ్ కు ఐలవ్యూ చెప్పకుండా వెళ్లిపోయావు అని హిమ.. జ్వాలను నిలదీస్తుంది. దీంతో నా శత్రువు హిమ ఫోన్ చేసింది అంటుంది జ్వాల. దీంతో హిమ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది