hima pleads nirupam to marry jwala in karthika deepam
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 13 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 1376 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బావ.. నువ్వు రిపోర్ట్స్ ను చించేస్తున్నావు. దేవుడేమో నా ఆయుష్షును క్యాలెంటర్ లో చించేస్తున్నాడు. చూడు.. ఇవి నా లేటెస్ట్ రిపోర్ట్స్ అని నిరుపమ్ కు చూపిస్తుంది హిమ. ఆ రిపోర్ట్స్ చూసి నిరుపమ్ షాక్ అవుతాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు బావ.. ఇవన్నీ చూసి కూడా నా మీద ప్రేమను పెంచుకుంటున్నావు అని అడుగుతుంది హిమ. దీంతో పెంచుకోవడం ఏంటి.. నీ మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు అంటాడు నిరుపమ్. వీళ్లిద్దరూ అక్కడ ఉన్న విషయం శాంతాబాయి.. శోభకు చెప్పడంతో.. వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి అక్కడికి శోభ వెళ్తుంది.
hima pleads nirupam to marry jwala in karthika deepam
కొన్ని రోజుల తర్వాత నేను ఉండను. నా మాట విని నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకో అని నిరుపమ్ ను కోరుతుంది హిమ. దీంతో శోభతో పాటు నిరుపమ్ కూడా షాక్ అవుతాడు. నా ప్రేమను ఆమె రూపంలో అందిస్తాను అంటుంది హిమ. నేను చెప్పిన అమ్మాయిని చేసుకోవాల్సిందే అంటుంది. దీంతో ఎవరా అమ్మాయి అని అడుగుతాడు నిరుపమ్. దీంతో జ్వాల అని పేరు చెబుతుంది. నాకు నువ్వు ప్రామిస్ చేస్తున్నావు అని చెప్పి జ్వాలను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని చెబుతుంది హిమ. దీంతో నిరుపమ్ షాక్ అవుతాడు.
దీప కార్తీక్ సంతోషంగా ఉన్నది కొన్ని రోజులే. ఉన్నన్నాళ్లు కలిసి బతకలేకపోయారు కానీ.. చావు వాళ్లిద్దరినీ కలిపింది. ఎన్ని రోజులు అయినా మన ఇంట్లో ఈ కష్టాలు తీరడం లేదు అని ఆనంద రావు, సౌందర్య ఇద్దరూ కార్తీక్, దీప ఫోటోను చూసి మాట్లాడుతారు.
ఏ జన్మలో చేసుకున్న పాపమో మమ్మల్ని ఇంకా వెంటాడుతోంది అని అంటుంది సౌందర్య. మరోవైపు శోభ.. స్వప్పను కలవడానికి తన ఇంటికి వెళ్తుంది. హిమ, జ్వాల ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుకుంటుంది. హిమకు నిరుపమ్ అంటే ఇష్టం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. తనకు క్యాన్సర్ ఉందని ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుంది కానీ.. తన బావను ఆ ఆటో దానికి కట్టబెట్టడమే నాట్ ఓకే అని అనుకుంటుంది శోభ.
స్వప్న.. శౌర్య గురించి చెబుతుంది శోభకు. హిమకు సోదరి ఉందని.. తను చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెబుతుంది. దీంతో ఆ జ్వాలే శౌర్యనా అని అనుమానపడుతుంది. మరోవైపు జ్వాలను పిలిచి తనకు గుడ్ న్యూస్ చెబుతుంది హిమ.
నీ డాక్టర్ బాబుకు నువ్వు ఇక ఐలవ్యూ చెప్పొచ్చు అని అంటుంది హిమ. రాత్రి పూట నిరుపమ్ బావను తీసుకొచ్చా. అతడిని కలువు అని చెబుతుంది. అప్పుడు ఐలవ్యూ చెప్పు అంటుంది. దీంతో సరే అంటుంది జ్వాల. రాత్రి కాగానే.. జ్వాల వస్తుంది. నిరుపమ్ కు ఐలవ్యూ చెప్పేందుకు జ్వాల వస్తుండగా.. తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ రాగానే కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల.
తెల్లారి.. నా ప్లాన్ అంతా వేస్ట్ చేశావు. ఏమైంది. ఎందుకు నిరుపమ్ కు ఐలవ్యూ చెప్పకుండా వెళ్లిపోయావు అని హిమ.. జ్వాలను నిలదీస్తుంది. దీంతో నా శత్రువు హిమ ఫోన్ చేసింది అంటుంది జ్వాల. దీంతో హిమ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
This website uses cookies.