Hitler Movie : చిరంజీవి హిట్లర్ మోహన్ బాబు చేయాల్సిందా.. ఎందుకు మిస్ అయింది?
Hitler Movie : ఒక్కోసారి సినిమా పరిశ్రమలో విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. మందుగా ఓ ప్రాజెక్ట్ ఓ హీరో దగ్గరకు వస్తుంది. ఆ ప్రాజెక్ట్‌ని పలు కారణాల వలన ఆ హీరో రిజెక్ట్ చేస్తే, అది వేరే హీరో చేసి సూపర్ హిట్ కొట్టడం జరుగుతుంది. అలా మోహన్ బాబు రిజెక్ట్ చేసిన హిట్లర్ సినిమాని చిరంజీవి చేసి పెద్ద హిట్ కొట్టాడు. హిట్లర్’ సినిమా చిరంజీవి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. రీమేక్ సినిమా అయినా కూడా తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లు ఈ కథను మార్చి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు చిరంజీవి. తెలుగులో హిట్లర్ సినిమా రీమేక్ రైట్స్ ను ఎడిటర్ మోహన్ తీసుకున్నారు. అయితే ఈ సినిమా తనకు నచ్చిందని చేయాలనుకుంటున్నాని చిరు స్వయంగా చెప్పడంతో మోహన్ సంతోషించారు. అలా 1997లో జనవరి 4న సంక్రాంతి కానుకగా హిట్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చిరంజీవి.
Hitler Movie : అలా మిస్ అయ్యాడు..
ముందుగా మోహన్ బాబు హీరోగా ఈ సినిమాను రీమేక్ చేద్దామంటూ ఎడిటర్ మోహన్ ఆలోచించారు. దర్శకుడిగా ఇవివి సత్యనారాయణను అనుకున్నారు. ఇదే విషయం రైటర్ మరుధూరి రాజాకు చెప్తే ఆయన వెళ్లి ఇవివికి చెప్పారు విషయం. అయితే అప్పటికే వీడెవడండీ బాబూ, అదిరింది అల్లుడు సినిమాలకు మోహన్ బాబుతోనే కమిట్ అయ్యాడు ఇవివి. మళ్లీ నాలుగోది అంటే రిజెక్ట్ చేస్తాడని భావించారు. చిత్రం విడుదలైన మూడు రోజుల తర్వాత తెలుగులో ఈ సినిమాను చిరంజీవి చేస్తున్నాడంటూ మరుధూరి రాజాకు ఎడిటర్ మోహన్ ఫోన్ చేసి మరీ చెప్పారు.
అయితే దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్య వచ్చిన తర్వాత మరుధూరి రాజా కాకుండా ఎల్బీ శ్రీరామ్ రైటర్‌గా వచ్చారు. ఆయన రాకతో రాజా చాలా హర్ట్ అయ్యారు. అవమానంగా ఫీల్ అయిపోయి బయటికి వెళ్లిపోయారు. కానీ ఎడిటర్ మోహన్ కోరిక మేరకు ఓ వర్షన్ కూడా రాసిచ్చారు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంతా రైటర్ మరుధూరి రాజా రాసినట్టు ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.అయితే హిట్లర్ ముందు చిరంజీవి వరస ఫ్లాపుల్లో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ఏడాది బ్రేక్ తీసుకున్నారు. మొత్తానికి 1997 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది.