TV Shows : సినిమాల నిర్మాణం సరే.. టీవీ షోల నిర్మాణంతో లాభాలు ఎలా వస్తాయో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TV Shows : సినిమాల నిర్మాణం సరే.. టీవీ షోల నిర్మాణంతో లాభాలు ఎలా వస్తాయో తెలుసా?

 Authored By prabhas | The Telugu News | Updated on :8 April 2022,6:30 pm

TV Shows : చిన్న హీరోలతో సినిమాలు నిర్మిస్తే తక్కువ బడ్జెట్ లో సినిమా పూర్తి అయ్యి.. తక్కువ వసూళ్లు నమోదు అవుతాయి. తద్వారా నిర్మాతలు లాభాలు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో సినిమా ఫ్లాపయితే నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తే కూడా నిర్మాతలకు లాభాలు దక్కే అవకాశం ఉంది.. లేదంటే నిరాశ తప్పదు. సినిమాలతో లాభ నష్టాల గురించి ఒక క్లారిటీ ఉంది. కానీ బుల్లితెరపై వచ్చే కార్యక్రమాల విషయంలో మాత్రం కొందరికి కన్ఫ్యూజన్ నెలకొంది. ఇప్పుడు మల్లెమాల వారు ఈటీవీ లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్వయంగా ఈ టీవీ వారు నిర్మించుకుని వారే టెలికాస్ట్ చేసుకోవచ్చు

కదా మధ్యలో మల్లెమాల వారు వెళ్లి నిర్మించాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరికి అనుమానం రావచ్చు.డైరెక్టుగా మల్లెమాల కాకుండా ఈటీవీ వారు నిర్మించుకోవచ్చు.. కానీ కాన్సెప్ట్ మల్లెమాల వారిది కనుక మల్లెమాల వారి నుండి ఆ కాన్సెప్ట్ ని తీసుకోలేరు కనుక ఈ టీవీ వారు మల్లెమాల వారు సంయుక్తంగా ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు. ఉదాహరణకు జబర్దస్త్ కార్యక్రమాన్ని తీసుకుంటే మల్లెమాల వారు ఆ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చు అంతా భరిస్తారు. పెట్టిన ఖర్చు తో పాటు లాభాలు వచ్చేలా సరైన సమయంలో ఈటీవీ లైవ్ టెలికాస్ట్ చేస్తారు. ఈటీవీ లో టెలికాస్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయం అంటే బ్రాండ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈటీవీ వారు మెజార్టీ పర్సంటేజ్ తీసుకొని మల్లెమాల వారికి కొంత భాగంలో ఇస్తారు.

how is tv shows production companies get money

how is tv shows production companies get money

తద్వారా మల్లెమాల వారికి కూడా లాభాల పంట పండుతుంది. కేవలం కార్యక్రమాన్ని నిర్మించి ఇచ్చినందుకు కొంత మొత్తం అని కాకుండా ఆ కార్యక్రమం సక్సెస్ అయిన నేపథ్యంలో దాని ద్వారా వచ్చే ఆదాయంలో వాటా ఇవ్వడంతో మల్లెమాల వంటి బుల్లి తెర కార్యక్రమాల నిర్మాణ సంస్థలకు వారు ఆదాయాన్ని ఇస్తూ ఉంటారు. అందుకే ఈ మధ్య కాలంలో బుల్లి తెరపై పలు కార్యక్రమాలను నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఆ మధ్య ప్రదీప్ కొంత కాలం క్రితం సుమ ఇంకా కొందరు కూడా నిర్మాణ సంస్థను ప్రారంభించి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు కార్యక్రమాలను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది