Dancer Janu : ఎందుకు ఇలా చేస్తున్నారు.. ఢీ డ్యాన్సర్ జాను ఆవేదన..!
ప్రధానాంశాలు:
Dancer Janu : ఎందుకు ఇలా చేస్తున్నారు.. ఢీ డ్యాన్సర్ జాను ఆవేదన..!
Dancer Janu : డాన్స్ వీడియోలతో ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాను షేక్ చేసి అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతే కాదు టీవీ షోల్లోనూ పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో జానులిరి ఒకరు. ఫోక్స్ సాంగ్స్ కు డాన్స్ చేస్తూ పాపులర్ అయ్యింది జానులిరి. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది జాను.

Dancer janu lyri emotional video
ఈ క్రేజీ డాన్సర్ చేసిన సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేశాయి. నేను చనిపోతే దానికి మీరే బాధ్యులు’ అని డ్యాన్సర్ జాను లిరి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అసభ్యకర ట్రోల్స్, రెండో పెళ్లి, ఊహాగానాలతో మానసికఒత్తిడికి గురవుతున్నానని అన్నారు. ‘నా జీవితం మీద కొంతమందికి అంత ఇంట్రెస్ట్ ఎందుకో అర్థం కావడం లేదు. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకండి.
నా కొడుకును బాగా చదివించి మంచి పోజిషన్‌లో చూడాలని అనుకుంటున్నా. మీరంతా నెగిటివ్ వార్తలు పోస్ట్ చేస్తే నేను మధ్యలోనే చనిపోతా’ అని ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశార అయి
యూట్యూబ్ ఛానెల్స్ లో జరుగుతున్న తప్పుడు ప్రచారం పై భోరున విలపించిన డ్యాన్సర్ జాను .. తన కొడుకు లేకపోయి ఉంటే తాను ఈ పాటికే చనిపోయేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.