Hyper Aadi : మనకు అన్నీ పడిపోయాయ్.. అదొక్కటే పని చేస్తోంది.. హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగ్స్
Hyper Aadi : సుడిగాలి సుధీర్‌తో పాటు చాలా మంది కమెడీయన్స్ జబర్ధస్త్ నుండి తప్పుకోవడంతో ఇప్పుడు షోకి వెన్నెముకగా నిలుస్తున్నాడు ఆది. ఆయన తనదైన స్టైల్‌లో పంచ్‌లు విసురుతూ కడుపుబ్బ నవ్విస్తున్నాడు. చాలా కాలంగా ఈ షో విజయంలో భాగం అవుతోన్న అతడు.. అదిరిపోయే పంచులతో సత్తా చాటుతున్నాడు. అదిరే అభి సహాయంతో జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది ఆరంభంలో స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన అతడు.. ఆ తర్వాత ఆర్టిస్టుగానూ మెప్పించాడు. దీంతో హైపర్ ఆదిగా మార్చి ప్రమోషన్ ఇచ్చారు నిర్వహకులు. హైపర్ ఆది ప్రతి స్కిట్‌నూ వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడు.
గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ.. తన టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. దీంతో అతడి కోసమే షోను చూసే వాళ్లు తయారైపోయారు. ఎవరు ఎన్ని రకాల స్కిట్లు చేసినా అతడినే విజయం వరించేది. మరీ ముఖ్యంగా హైపర్ ఆది చేస్తున్న స్కిట్లే ఎప్పుడూ ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో ఇప్పటికే ఈ కమెడియన్ ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి. తాజాగా కృష్ణభగవాన్‌తో కలిసి ఓ స్కిట్ చేశారు ఆది. ఇందులో ఇద్దరు వీల్ చైర్‌లో కూర్చొని తెగ ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇంద్రజపై పంచ్‌లు కూడా వేస్తుంటారు. ఆమె హ్యాపీగా స్వీకరించి నవ్వేస్తుంటుంది.

Hyper Aadi about Double Meaning Dialogues in Jabardasth
Hyper Aadi : ఇంత దారుణమా..
ఇక ఆది ఓ సందర్భంలో మాట్లాడుతూ.. మనకు అన్నీ పడిపోయాయ్.. అదొక్కటే పని చేస్తోంది ఎందుకు అని కృష్ణ భగవాన్‌తో అంటాడు. దానికి కృష్ణ భగవాన్ నోటి దూల ఉంది కాబట్టి అనగానే నవ్వులు పూస్తాయి.అది ఉంటే ఏమన్నా తప్పు అంటారా అని కృష్ణ భగవాన్ ని ఆది అడగ్గా, ఆది లేకపోతే బయటకు పంపించేస్తారు అని చెబుతాడు. ఇక కృష్ణ భగవాన్ భార్యగా నటించిన వారు నాకు పుల్లటిగా ఏదైన తినాలని అనిపిస్తుంది అంటే దానికి కృష్ణ భగవాన్ పది రోజుల క్రితం ప్రిజ్‌లో ఉన్న పెరుగు తిను అని అంటాడు. దాంతో అందరు పగలబడి నవ్వుతారు. మొత్తానికి ఈ వారం ఎపిసోడ్‌లో కృష్ణ భగవాన్ హైలైట్ కానున్నారని తెలుస్తుంది.
