Hyper Aadi : తన ప్రేమను బయటపెట్టేశాడు!.. హైపర్ ఆది స్ట్రాటజీ వర్కవుట్ అయ్యేనా?
Hyper Aadi : హైపర్ ఆది ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. గత కొన్నేళ్లుగా హైపర్ ఆది పెళ్లి మీద రకరకాలుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. రేపోమాపో పెళ్లి అన్నట్టుగా యూట్యూబ్‌లో వార్తలు వస్తూ ఉంటాయి. అయితే వాటిని హైపర్ ఆది ఖండిస్తూ వచ్చేవాడు. కానీ ఒకానొక సమయంలో వాటికి స్పందించడం మానేశాడు.
ఆ మధ్య హైపర్ ఆదితో వర్షిణి పెళ్లి అంటూ రాసేశారు. ఢీ షోలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ పీక్స్‌కు వెళ్లడంతో అందరూ ప్రేమ, పెళ్లి గురించి రాసేశారు. ఆ తరువాత హైపర్ ఆది రిలేటివ్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడని రాశారు. అలా ఎప్పుడూ హైపర్ ఆది పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆది తన మనసులోని మాట విప్పేశాడు.

Hyper Aadi About His Love In Angaranga Vaibhavanga
Hyper Aadi : ఆది ఏం చెప్పాడు?
హైపర్ ఆది ఉగాది ఈవెంట్‌లో అసలు విషయాన్ని చెప్పేలా ఉన్నాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఆది ఓ విషయాన్ని చెప్పాడు. కానీ దాన్ని మ్యూట్ చేసేశారు ప్రోమోల. ఇది టీఆర్పీ స్ట్రాటజీనా? లేదంటే నిజంగానే ఆది తన మనసులోని అమ్మాయి గురించి చెప్పాడా? అన్నది చూడాలి. మరి పూర్తి ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆది చెప్పిన విషయాలేంటో తెలుస్తుంది.
