
Karthika Deepam Hima aka Sahruda Calls Nirupam Paritala
Karthika Deepam Hima : డాక్టర్ బాబు, వంటలక్క కార్తీక దీపం సీరియల్లోకి మళ్లీ వచ్చారు.వారి రాకతో కార్తీక దీపం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఇన్నిరోజులు వారు లేకపోవడంతొ ఆ సీరియల్‌ను ఎవ్వరూ పట్టించుకోలేదు. రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. అయితే లాభం లేదని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయి మళ్లీ వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను పట్టుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా రేటింగ్స్ ఊపందుకున్నాయి. ఇక వంటలక్క, డాక్టర్ బాబు, హిమ, శౌర్య ఇలా అందరూ మళ్లీ వచ్చారు. కథ ప్రస్తుతం గతంలోకి వెళ్లింది. ఆ చిన్న పిల్లలు శౌర్య, హిమలు, దీప, కార్తీక్ మధ్య కథ నడుస్తోంది. దీంతో రేటింగ్స్ బాగానే వస్తాయ్ అని చెప్పొచ్చు. అయితే ఇన్నేళ్లు కలిసి నటించారు.
చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి హిమ, శౌర్యలు దీప, కార్తీక్‌లతోనే ఉన్నారు. అంటే ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాలతోనే హిమ (సహృద), శౌర్య (కృతిక)లు సెట్‌లోనే ఎక్కువ టైం గడుపుతుంటారు. మామూలుగా అయితే ఆన్ స్క్రీన్‌లో ఎలాంటి రిలేషన్ ఉంటే.. బయట కూడా అలానే పిలుస్తుంటారు. కానీ మన హిమ మాత్రం డాక్టర్ బాబు నాన్న అని పిలవడం లేదు. నిన్న (ఆగస్ట్ 17) నిరుపమ్ బర్త్ డే. అందరూ స్పెషల్ విషెస్ అందించారు. డాక్టర్ బాబుకి బర్త్ డే విషెస్ అని ప్రేమీ విశ్వనాథ్, శౌర్యలు విషెస్ చెబుతూ పోస్టులు వేశారు. ఇక హిమసైతం ఓ పోస్ట్ వేసింది.
Karthika Deepam Hima aka Sahruda Calls Nirupam Paritala
హ్యాపీ బర్త్ డే అన్నయ్య అంటూ నిరుపమ్‌కు విషెస్ చెప్పింది. అదేంటి? అన్నయ్య అని అనడం అంటూ అందరూ ఆశ్చర్యపోతోన్నారు. మొత్తానికి నిరుపమ్ మాత్రం ఆ పిల్లలతో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ సెట్‌లో ఎంతో సరదాగా ఉంటాడు. ఇప్పుడు కార్తీకదీపంలోకి మళ్లీ మోనితను తీసుకురండి.. ఆమె మాత్రం ఏ పాపం చేసింది.. డాక్టర్ బాబు,వంటలక్కలను తీసుకురండి అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరి మళ్లీ మోనిత,వంటలక్క, డాక్టర్ బాబుల చుట్టూ కథ తిరుగుతుందా? లేదా? ఎలా కథనం సాగుతుందో చూడాలి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.