Hyper aadi : పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హైపర్ ఆది.. ఆ ట్వీట్‌లతో కమెడియన్‌కు కష్టాలు

Authored By Cinema Desk | The Telugu News | Updated on: September 30, 2021, 11:14 am

Hyper aadi : హైపర్ ఆది సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడు. ఏదైనా ఉంటే ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో అప్పుడప్పుడు స్పందిస్తుంటాడు. ఆయనకు ట్విట్టర్ ఖాతా లేదు. కానీ ఆయన పేరుతో ఓ ట్విట్టర్ అకౌంట్ తెగ హల్చల్ చేస్తుంటుంది. పవన్ కళ్యాణ్ పోసానీ కృష్ణ మురళీ ఇష్యూను ఉద్దేశించి హైపర్ ఆది పేరుతో ఓ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ దారుణమైన ట్వీట్ బయటకు వచ్చింది. అది నిజంగానే హైపర్ ఆది వేశారనుకోవడంతో నానా రచ్చ జరిగింది.

adi

adi

ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే.. ‘పవన్ కళ్యాణ్ తప్పుచేశాడని ఏ ఒక్కడు నిరూపించిన మళ్లీ బతికిఉండగా ఆయన పేరు ఎత్తను.. మీకే సపోర్ట్ చేస్తా.. అధికారం మీది మీరు మగాళ్లు అయితే ఒక అమ్మాకి అబ్బకి పుట్టుంటే నిరూపించండి’, ‘చెప్పుతో కొట్టాలి ఈ లేబర్ ముండా కొడుకు పోసాని క్రిష్ణమురళిని. వాడు మాట్లాడేది వాడికే అర్థం కాదు. పవన్ కళ్యాణ్‌కి నీతులు చెప్తున్నాడు’ అంటూ హైపర్ ఆది పేరుతో ఉన్న ఆ ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ పడింది.

ayper adi

ayper adi

Hyper aadi : ట్విట్టర్ అకౌంట్ లేదన్న ఆది..

అయితే దానిపై హైపర్ ఆది క్లారిటీ ఇచ్చాడు. ఫేస్ బుక్ వేదికగా ఓ వీడియోను వదిలాడు.‘నాకు ఎటువంటి ట్విట్టర్ అకౌంట్ లేదు.. నా పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ పోస్ట్ చూసి నాకు కొంతమంది రిలేటెడ్‌గా కామెంట్స్ పెడుతున్నారు.

నాకు ఎటువంటి ట్విట్టర్ అకౌంట్ లేదు. ఈ విషయంపై సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేస్తున్నాను. ఎవరూ కూడా ఆ ఫేక్ అకౌంట్‌ని నమ్మొద్దు.. నా పేరుతో అఫీషియల్‌గా ఫేస్ బుక్ అకౌంట్ మాత్రమే ఉంది. ఏదైనా ఉంటే లైవ్‌కి వచ్చి మాట్లాడతా తప్ప ఇలాంటి పోస్ట్‌లు పెట్టను.. నాకు ఎటువంటి అకౌంట్‌లు లేవు. దయచేసి ఎవరూ రెస్పాండ్ కాకండి’ అని వేడుకున్నాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp