Hyper Aadi : హైపర్ ఆది రాకతో ఢీ లో సందడి షురూ.. ఇంకాస్త జోష్ కు వాళ్లు ఉంటే బాగుండేది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : హైపర్ ఆది రాకతో ఢీ లో సందడి షురూ.. ఇంకాస్త జోష్ కు వాళ్లు ఉంటే బాగుండేది

 Authored By prabhas | The Telugu News | Updated on :3 March 2022,9:00 pm

సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న ఈ టీవీ డాన్స్ షో ఢీ ఇటీవల ఏ మాత్రం ఆకట్టుకోలేక పోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. తాజా సీజన్‌ లో రష్మీ మరియు సుదీర్ లు లేక పోవడంతో పాటు.. షో లో ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గింది అంటూ అంతా భావిస్తున్నారు. ఎంటర్‌ టైన్మెంట్ ను పెంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారి వారి ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఆది మరియు ఇతర కంటెస్టెంట్ లు టీం లీడర్లు జడ్జీలు ఎంతగా ప్రయత్నించినా రేటింగ్ మాత్రం రెండు దాటడం లేదు.ఈ సమయంలో ఆది కూడా లేకపోవడంతో డాన్సులు షో స్థాయి మరీ దారుణంగా పడిపోయింది.

ఆది కనిపించకపోవడంతో సుధీర్ రష్మీ ల తరహాలోనే ఆది ని కూడా మల్లెమాల వారు తప్పించారు అనే ప్రచారం జరిగింది. ఈ షో కు సంబంధించినంత వరకు అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. గతంలో సూపర్ హిట్ అనిపించుకున్నా.. ఇప్పుడు ఎందుకు ఇలా అయింది అంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఈ సమయం లో వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఢీ షో లో హైపర్ ఆది కనిపించబోతున్నాడు అని క్లారిటీ వచ్చింది.తాజాగా వచ్చిన పోమోతో ప్రేక్షకుల హ్యాపీగా ఫీలవుతున్నారు. ఖచ్చితంగా అది ఉంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది అని అంతా భావిస్తున్నారు.

Hyper Aadi came back etv dance show dhee

Hyper Aadi came back etv dance show dhee

ప్రోమో లో మాస్టర్ తో స్టెప్పులు వేయించే స్కిట్టు మొదలుకుని ప్రతి ఒక్కటి కూడా ఆకట్టుకునే విధంగా ఆది మార్చగలడు అని మరోసారి నిరూపితమైంది. అందుకే ఆది లేకుంటే చూడలేక పోయారు. ముందు ముందు అయినా ఆది తప్పు కోకూడదు అంటూ ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత రెండు వారాలుగా రానటువంటి రేటింగ్ వచ్చే వారం ఎపిసోడ్ కి మంచి రేటింగ్‌ వస్తుంది అని నిర్వాహకులు భావిస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి కూడా రెండు వారాలు కనిపించకుండా పోయిన ఆది ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఆది లేకుండా ఏ ఒక్క షో కూడా సక్సెస్‌ అవ్వలేక పోతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది