Hyper Aadi : నీలో అంత వేడి ఉందా?.. సుడిగాలి సుదీర్ గాలి తీసిన హైపర్ ఆది
Hyper Aadi : బుల్లితెరపై ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తాజాగా ప్రసారమైన ఈ ఎపిసోడ్ ఆద్యంతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా గెటప్ శీను గెటప్ లో కనిపించగా హైపర్ ఆది, పంచ్ ప్రసాద్ తన మనవల్లుగా యాక్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ స్కిట్ లో భాగంగా గెటప్ సీను తన ఆస్తి తన మనవళ్లకు చెందాలంటే తను చెప్పిన టాస్క్ విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పారు.
అయితే ఈ టాస్క్ లో భాగంగా రెండు పెద్ద ఐస్ ముక్కలపై ఎవరైతే ఎక్కువ సేపు కూర్చుంటారో వారికి తన ఆస్తి చెందుతుందని గెటప్ సీను చెప్పడంతో వెంటనే హైపర్ ఆది నువ్వే పడుకొని ఆస్తి మొత్తం నువ్వే తీసుకో అంటూ తన తాత (గెటప్ శీను) పై పంచ్ వేసాడు. ఇక వెంటనే వీరిద్దరూ ఐస్ గడ్డలపై కూర్చొని ఉండగా హైపర్ ఆది పంచ్ ప్రసాద్ తనదైన శైలిలో పంచ్ వేస్తూ ప్రేక్షకులను నవ్వించారు.

Hyper aadi comment on sudigali sudheer in sridevi drama company show
Hyper Aadi : సుడిగాలి సుదీర్ పరువు తీసిన హైపర్ ఆది:
సుమారు కొంత సమయం పాటు హైపర్ ఆది పంచ్ ప్రసాద్ కూర్చోవడంతో యాంకర్ గా వ్యవహరిస్తున్న సుడిగాలి సుదీర్ ఇక చాలు లేవండి అంటూ హైపర్ ఆదిని లేపబోయాడు.దీంతో హైపర్ ఆది నువ్వు కూడా మాతో పాటు కాసేపు కూర్చోవచ్చు కదా అంటూ ఆది సుదీర్ ను అనడంతో సుధీర్ ఆ మాటకు సుధీర్ మాట్లాడుతూ ఐస్ పై బేర్ ఫుట్ తో నిలబడే వాణ్ని మన హీట్ కు ఏ ఐస్ అయినా కరిగిపోవాల్సిందే అని సుధీర్ అనడంతో వెంటనే నీలో అంత వేడి ఉందా అంటూ.. హైపర్ ఆది సుదీర్ పరువు మొత్తం తీసేసాడు.