Hyper Aadi : కెమెరాలు లేకుంటే బాగుంటుందట.. మామిడితోటలో హైపర్ ఆది హల్చల్..!
Hyper aadi : ఈటీవీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మమ్మగారి ఊరు అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర పై పలు కార్యక్రమాల ద్వారా సందడి చేసే కమెడియన్స్ ఈ కార్యక్రమంలో తమదైన శైలిలో ఆటలు పాటలతో, కామెడీ డైలాగులతో ప్రతి ఒక్కరిని ఎంతో ఎంటర్టైన్ చేశారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు విడుదల చేయడంతో ఈ ప్రోమోలు కాస్తా వైరల్ గా మారాయి.
ఇకపోతే తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ కి స్నానాలు చేయించడం, అందరూ కలిసి డాన్స్ లు వేయడం, ఒకరిపై ఒకరు సెటైర్లు వేయడం అందరిని ఆకట్టుకున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బంగార్రాజు టీమ్ వేదికపైకి వచ్చింది.ఈ క్రమంలోనే పొట్టి నరేష్ హైపర్ ఆది హీరోయిన్ కృతి శెట్టితో పులిహోర కలపడానికి ప్రయత్నం చేశారు. ఇలా పాటలు డాన్సులు అనంతరం కమెడియన్స్ అందరూ కూడా మామిడి తోటకి వెళ్ళిన సీన్స్ చూపించారు.

hyper aadi comments on cameras in ammamma gari ooru promo
Hyper aadi : హైపర్ ఆది సరసాలు..
అందరూ కూడా సైకిళ్లపై మామిడి తోటకి వెళ్లారు. ఇలా మామిడి తోటలో వీరందరూ ఎంతో సందడి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్స్ తమదైన శైలిలో పంచులు వేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్వించారు. ఈ క్రమంలోనే ఒక లేడి కమెడియన్ హైపర్ ఆదిని ఉద్దేశిస్తూ ఆది బావ తోటకు వస్తే ఇంత ఆనందంగా ఉంటుందా… అని అడగగా వెంటనే హైపర్ ఆది కెమెరాలు లేకుంటే ఇంకా బాగుంటుంది అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు.
