Hyper Aadi : మరో వివాదంలో హైపర్ ఆది.. మంచు విష్ణును ఉద్దేశించి పరోక్ష కామెంట్స్..!
Hyper Aadi : ఇటీవల ఓ చానల్ వారు నిర్వహించిన దీపావళి ఈవెంట్‌లో ఓ హీరోను ఉద్దేశించి హైపర్ ఆది చేసిన వ్యాఖ్యల పట్ల ఆ హీరో అభిమానులు ఫైర్ అయిన వివాదం ముగియక ముందే హైపర్ ఆది మరో వివాదంలో చిక్కుకున్నాడు. అదేంటంటే..కమెడియన్‌గా ఎంతో పేరు సంపాదించుకున్న హైపర్ ఆది..వేసే పంచులు, డైలాగ్ డెలివరి నేచురల్‌గా ఉంటాయి. ఆది పంచులకు జడ్జ్‌లు పడి పడి నవ్వుకుంటారు. అయితే, ఇటీవల దీపావళి సందర్భంగా మల్లెమాల ప్రొడెక్షన్ వారు ‘తగ్గేదేలే’ అనే ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. అందులో హైపర్ ఆది చేసిన స్కిట్ వివాదాస్పదంగా మారింది.

hyper aadi comments on manchu vishnu
ఈ షోలో హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్ కలిసి ఒక స్కిట్ చేశారు. అందులో ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు గురించి మాట్లాడారు. మా ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి చేసిన విమర్శలను ఆ క్రమంలోనే నరేశ్ మంచు విష్ణును కంట్రోల్ చేయడానికి సంబంధించిన మాటలను స్కిట్‌లో వాడారు. దాంతో మంచు విష్ణు ఫ్యాన్స్ హైపర్ ఆదిని టార్గెట్ చేశారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిని పట్టుకుని ఇలా కామెంట్స్ చేయడం సరికాదని మంచు విష్ణు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు వర్గీయులు హైపర్ ఆదికి షూటింగ్ లోకేషన్ కు వెళ్లి మరి వార్నింగ్ ఇచ్చిన్నట్లు వార్తలొస్తున్నాయి.
Hyper Aadi : మరో కాంట్రవర్సీలో ఆది.. ఈ సారి ఏ హీరో అంటే..

hyper aadi comments on manchu vishnu
అందులో ఎంత నిజముందో తెలియదు. కానీ, హైపర్ ఆది ఇటీవల కాలంలో బాగా వివాదాస్పదమవుతున్నాడు. అయితే, చాలా సార్లు స్కిట్ చేసే క్రమంలో లైన్ దాటి మరి స్కిట్ చేసేస్తుంటాడు హైపర్ ఆది..ఈ సారి కూడా అలానే ఆది మంచు విష్ణును టార్గెట్ చేశాడనే అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. చూడాలి మరి.. ఏమవుతుందో..