Hyper Aadi : స్కిట్‌లో షాక్ ఇచ్చిన ఆది.. చెప్పకుండా చేశాడంటూ అనసూయ ఫైర్
Hyper Aadi అనసూయ, ఆది కాంబినేషన్ బుల్లితెరపై ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. అనసూయ మీదున్న కోరికను అప్పుడప్పుడు తన స్కిట్ల రూపంలో ఆది బయటపెడుతున్నట్టు కనిపిస్తుంది. అనసూయ అంటే ఇష్టమున్నా కూడా అవకాశం చేజారిపోయిందని, భరద్వాజ్ పెళ్లి చేసుకున్నాడు అని నిట్టూర్పులు ఊరుస్తుంటాడు ఆది. అలా ఆది వేసే పంచులు, కౌంటర్లకు అనసూయ కూడా అప్పుడప్పుడ తల దించుకుంటుంది. తాజాగా ఆది వేసిన పంచ్‌లకు అందరూ షాక్ అవుతున్నారు.

Hyper Aadi Counters On Anasuya In jabardasth
ఆది స్కిట్లో అనసూయ స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. దీపావళి సందర్బంగా వచ్చిన ఈ ఎపిసోడ్‌లో ఆది అనసూయలు దుమ్ములేపేశారు. అయితే ఆది మధ్య మధ్యలో ఎలాంటి పంచులు వేస్తాడో అందరికీ తెలిసిందే. ప్రాక్టీస్‌లో డైలాగ్స్ చెప్పడు.. అసలు అది ఉందని, అలాంటి పంచ్‌లు వేస్తాడు అని ముందు చెప్పడు. అప్పటికప్పుడు అల్లేస్తాడు. ఎదుటి వారి మీద కౌంటర్లు విసురుతుంటాడు. అలానే అనసూయ మీద కూడా కొన్ని కామెంట్లు చేశాడు.
Hyper Aadi అనసూయపై ఆది కౌంటర్లు

Hyper Aadi Counters On Anasuya In jabardasth
ప్రాక్టీస్‌లో అవేం చెప్పలేదంటూ అనసూయ చెప్పుకొచ్చింది. ఏడు పదుల వయసులో ఏడు సముద్రాలు దాటి ఏం వస్తావ్ లే అని అనసూయ వయసు మీద కౌంటర్లు వేశాడు. ప్రాక్టీస్‌లో ఈ డైలాగ్ చెప్పలేదని అంటుంది. ఇక మరో సారి సందర్భంలో.. అనుభూతి అంటూ మరో డైలాగ్ వస్తుంది. మేకప్ లేనప్పుడు అను భూతంలా కనిపిస్తుంది.. కదా? అని ఆది పంచ్ వేశాడు. ఈ డైలాగ్ కూడా చెప్పలేదు కదా? అని రోజా అంటుంది. రోజా అలా అనడంతో.. అవును అంటూ అనసూయ కూడా అనేస్తుంది.