Hyper Aadi : వరుసగా నాల్గవ వారం మిస్ అయిన హైపర్ ఆది.. జబర్దస్త్ లో అసలేం జరుగుతోంది?
Hyper Aadi : జబర్దస్త్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు ల్లో హైపర్ ఆది పేరు ఒకటి కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన జబర్దస్త్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వస్తున్నాడు. కానీ ఈ మధ్యలో ఆయన కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా హైపర్ ఆది కనిపించకుండా పోయాడు. కానీ ఒకటి రెండు వారాలు మాత్రమే హైపర్ ఆది జబర్దస్త్ లో మళ్లీ కనిపించాడు. కానీ ఇప్పుడు ఏకంగా నాలుగు వారాలుగా హైపర్ ఆది కనిపించడం లేదు. హైపర్ ఆది ఎటు వెళ్ళాడు.. ఎక్కడికి వెళ్ళాడు..
ఎక్కడ ఉన్నాడు అంటూ ప్రస్తుతం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.గత కొన్ని వారాలుగా హైపర్ ఆది కి మరియు మల్లె మాల వారికి కొన్ని విషయాల పట్ల విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అందువల్లే హైపర్ ఆది వెళ్లిపోయాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చిన్న బ్రేక్ తీసుకుంటే ఖచ్చితంగా రెండు మూడు వారాల్లో వచ్చేవాడు. కానీ ఇప్పటి వరకు హైపర్ ఆది జబర్దస్త్ టీం లో కనిపించడం లేదు. కనుక కచ్చితంగా ఆయన పూర్తిగా జబర్దస్త్ మానేసినట్లే ఉన్నాడు అంటూ సమాచారం అందుతోంది.హైపర్ ఆది కి వచ్చిన స్టార్ డమ్ మరియు క్రేజ్ కారణంగా భారీగా పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట..

hyper aadi good bye to jabardasth comedy show
అలాంటి భారీ పారితోషికం మల్లెమాల వారు ఇవ్వలేరు. కనుక జబర్దస్త్ నుండి ఆయన వైదొలిగాడు అంటూ ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ లో లేకుండా ఇతర ఈటీవీ కార్యక్రమాల్లో ఆయన ఉండటం చర్చనీయాంశం గా మారింది. కేవలం జబర్దస్త్ లో మానేయడానికి ఉద్దేశం ఏంటి అంటూ ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. మళ్లీ జబర్దస్త్ లో హైపర్ ఆది రీఎంట్రీ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరోవైపు హైపర్ ఆది కి తగిన గుర్తింపు వేరే ఛానల్లో వస్తే ఆయన ప్రయత్నించవచ్చు అంటూ కొందరు సూచిస్తున్నారు.